LOADING...
Strike in Kollywood: టోకెన్ స్ట్రైక్ ఎఫెక్ట్‌.. తమిళ సినీ పరిశ్రమలో షూటింగ్స్ బంద్
టోకెన్ స్ట్రైక్ ఎఫెక్ట్‌.. తమిళ సినీ పరిశ్రమలో షూటింగ్స్ బంద్

Strike in Kollywood: టోకెన్ స్ట్రైక్ ఎఫెక్ట్‌.. తమిళ సినీ పరిశ్రమలో షూటింగ్స్ బంద్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 02, 2026
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ పరిశ్రమలో నిర్మాతలు సమ్మె బాట పట్టారు. నటులు, సాంకేతిక నిపుణులు పారితోషికాలను రెవెన్యూ షేరింగ్ విధానంలో స్వీకరించాలని నిర్మాతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై నడిగర్ సంఘం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో నేడు (మే 2) తమిళ సినీ పరిశ్రమలో షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. గత మూడేళ్లలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు భారీగా పెరిగాయని నిర్మాతలు పేర్కొన్నారు.

వివరాలు

నష్టాలు ఎదురైనప్పుడు నిర్మాతలు సాయం చేయాలి

సినిమా అనుకున్నంతగా ఆడకపోతే నష్టాలు పూర్తిగా తమపైనే పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా పరంగా నష్టాలు ఎదురైనప్పుడు నిర్మాతలకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని వారు వాపోయారు. తమ పరిస్థితిని పరిశ్రమ మొత్తం గ్రహించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఒక్కరోజు టోకెన్ సమ్మె చేపట్టినట్లు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వెల్లడించింది.

Advertisement