విషాదంలో నిత్యామీనన్.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్
దక్షిణాది స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ తీవ్ర విషాదంలో ఉన్నారు. నిత్యా అమ్మమ్మ కన్నుమూశారు. దీంతో భావోద్వేగానికి గురైన నిత్యా మీనన్ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలోనే తన అమ్మమ్మ తాతయ్యలతో కలిసి దిగిన ఓ ఫొటోను నిత్యా షేర్ చేశారు. ఒక శకం ముగిసిందని, గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్, మరో లోకంలో కలుద్దామంటూ రాసుకొచ్చారు. తాతయ్యను మంచిగా చూసుకుంటానని నిత్యా తన అమ్మమ్మని కోల్పోయిన వేదనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. స్పందించిన పలువురు నెటిజన్లు నిత్యాను ధైర్యంగా ఉండాలని పోస్ట్లు పెడుతున్నారు.
వీలైనంత ఎక్కువ సమయాన్ని తాతాయ్యకే ఇవ్వాలని నెటిజన్ల సూచనలు
అమ్మమ్మని కోల్పోయినా, తాతయ్య ఉన్నారు కదా, ఆయనతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడుపాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఆయనలోనే ఆవిడను చూసుకోవాలని నిత్యాకి ధైర్యం చెబుతున్నారు. దాదాపు 12 ఏళ్ల కిందట అలా మొదలైందితో టాలీవుడ్‌లోకి అడుగపెట్టిన ఈ మలయాళ క్వీన్, ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపును సాధించుకుంది. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీమళ్లీ ఇదిరాని రోజు లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో జమ చేసుకుంది. భీమ్లానాయక్, తిరు వంటి సూపర్ హిట్ లతోనూ మళ్లీ జోరు అందుకుంది. ప్రస్తుతానికి నిత్యా రెండు, మూడు సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం. వెబ్ సిరీస్ లోపైనా సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.