Yakkali Ravindra Babu: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతితో షాక్‌లో ఉన్న.. చిత్రపరిశ్రమను మరో మరో మరణ వార్త కుదిపేసింది.
ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు (55) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతల్లో యక్కలి రవీంద్ర బాబు ఒకరు. ఈ బ్యానర్‌పై రవీంద్ర బాబు సొంతఊరు, గంగపుత్రులు లాంటి అవార్డులను గెల్చుకున్న సినిమాలను నిర్మించారు.
అలాగే, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, వలస, గల్ఫ్, రొమాంటిక్ క్రిమినల్స్ లాంటి సక్సెస్‌ఫుల్ మూవీస్‌ను ఆయన నిర్మించారు.
సినిమా
మార్కాపురంలో రవీంద్ర బాబు జననం
యక్కలి రవీంద్ర బాబు మార్కాపురంలో జన్మించారు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ఛార్టర్డ్ ఇంజనీర్‌గా పని చేసారు.
ఈ క్రమంలో ఆయనకు సినిమాలపై ఆసక్తి మళ్లింది. అనంతరం నిర్మాతగా మారారు. ఈ క్రమంలో పలు సినిమాలకు నిర్మాతగా మారారు.
ఒక్క తెలుగులోనే కాకుండా, తమిళ్, మలయాళం బాషల్లో దాదాపు ఆయన 17 సినిమాల వరకు తెరకెక్కించారు. ఆయన నిర్మాత గానే కాకుండా, గీత రచయితగా కూడా పని చేశారు.
సంస్కార కాలనీ , మా నాన్న నక్సలైట్ వంటి సినిమాలకు యక్కలి రవీంద్ర బాబు సాహిత్యం అందించారు. రవీంద్రబాబుకు భార్య, కుతూరు, కుమారుడు ఉన్నారు.