Page Loader
తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చిన 2022: ఈ సంవత్సరం టాప్ మూవీస్ ఇవే
టాప్ 2022 తెలుగు సినిమాలు

తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చిన 2022: ఈ సంవత్సరం టాప్ మూవీస్ ఇవే

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 21, 2022
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

2022లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సూపర్ హిట్ అయ్యిన మూవీస్ ఇప్పుడు చూద్దాం. సీతారామం: దుల్కర్, మృణాల్ నటించిన ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. RRR: రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామి సృష్టించింది. కార్తికేయ2: నిఖిల్ నటించిన ఈ సినిమా 2022లో అతి పెద్ద హిట్స్ లో ఒకటిగా నిల్చింది. ఒకే ఒక జీవితం: టైం ట్రావెల్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బింబిసారా: చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ కు ఈ సినిమాతో మంచి విజయం దక్కింది.

తెలుగు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఆదరించిన టాప్ తెలుగు సినిమాలు

మేజర్: ఈ సినిమాలో అడవి శేష్, సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో ఒదిగిపోయాడు. క్లైమాక్స్ లో అతని నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. యశోదా: సమంత అద్భుతమైన నటనతో ఈ సినిమా విజయానికి కారణం అయింది. గాడ్ ఫాదర్: మలయాళ సినిమా లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా రూపొందించిన ఈ సినిమాలో బ్రహ్మగా చిరంజీవి ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టారు. ఇంకా ఈ లిస్ట్ లో అంటే సుందరానికి, ఓరి దేవుడా, మసూద, నేను మీకు బాగా కావాల్సినవాడిని, విరాట పర్వం, ఉర్వశివో రాక్షసివో, జిన్నా, క్రేజీ ఫెలో, సేనాపతి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్ సినిమాలు ఉన్నాయి.