Loading...
OTT This Week: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే ఆసక్తికర చిత్రాలు ఇవే..
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే ఆసక్తికర చిత్రాలు ఇవే..

OTT This Week: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే ఆసక్తికర చిత్రాలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త సినిమాల కోసం ఎదురుచూసే సినీప్రియులకు మరో ఆసక్తికరమైన వారం వచ్చేసింది. ప్రతి వారం మాదిరిగానే ఈసారి కూడా ప్రముఖ ఓటిటి వేదికలు వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కామెడీ, యాక్షన్, భావోద్వేగాలు, ప్రేమ కథలతో రూపొందిన కొత్త సినిమాలు, మినీ చిత్రాలు ఈ వారాంతంలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ముఖ్యంగా సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం'తో పాటు 'సమ్‌వేర్ సమ్‌టైమ్' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

వివరాలు 

జియోహాట్‌స్టార్‌లోకి 'మా ఇంటి బంగారం'

సమంత కథానాయికగా,నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'మా ఇంటి బంగారం' ఈ వారం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రాన్ని సమంత తన భర్త రాజ్ నిడిమోరు,హిమాంక్ రెడ్డి దువ్వూరుతో కలిసి నిర్మించారు.

కథ విషయానికి వస్తే.. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన స్వర్ణ (సమంత) అనాథాశ్రమంలో పెరుగుతుంది.

అనంతరం అనిరుధ్ అనే సంపన్న కుటుంబానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుని ఆ ఇంటి కోడలిగా అడుగుపెడుతుంది.

కుటుంబ సభ్యులందరి అభిమానాన్ని సంపాదించి ఆదర్శ కోడలిగా గుర్తింపు పొందాలని ఆమె ప్రయత్నిస్తుంది.

వివరాలు 

ఈటీవీ విన్‌లో 'సమ్‌వేర్ సమ్‌టైమ్'

అయితే ఆ ప్రయాణంలో స్వర్ణ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆమె గతంలో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి? అత్తింట్లోకి వెళ్లిన తర్వాత కొందరిపై కాళికాదేవిలా ఎందుకు విరుచుకుపడింది? ఆమె జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు ఏ మలుపులు తీసుకున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి. ఈ సినిమా శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

పరిచయం లేని ఇద్దరు వ్యక్తుల అనుకోని ప్రయాణం నేపథ్యంలో రూపొందిన చిత్రం 'సమ్‌వేర్ సమ్‌టైమ్'. జీవితంలో తాను ఏ పనికీ పనికిరానని భావిస్తూ నిరాశతో గడిపే సూర్య జీవితంలోకి అనుకోకుండా ఓ యువతి ప్రవేశిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఈటీవీ విన్‌లో 'సమ్‌వేర్ సమ్‌టైమ్'

ఆ పరిచయం వారి జీవితాలను ఎలా మార్చింది? ఆ ప్రయాణం వారిని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టింది? అనే అంశాల చుట్టూ ఈ కథ సాగుతుంది.

ఈ చిత్రానికి ప్రభుచంద్ దర్శకత్వం వహించగా, ఉదయ్ సద్దాల నిర్మించారు. ప్రధాన పాత్రల్లో రఘువరన్, యశోర నటించారు.

వెంకటేశ్ మహా, సాయి కదిర, తృప్తి బండారి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మినీ చిత్రం శుక్రవారం నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ వారాంతంలో కుటుంబంతో కలిసి ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు ఈ రెండు చిత్రాలు మంచి ఎంపికగా నిలిచే అవకాశముంది.

ADVERTISEMENT

వివరాలు 

ఇతర చిత్రాలు 

సినిమా విడుదల ఓటీటీ వేదిక

రెడ్ అలర్ట్ (సిరీస్) బుధవారం అమెజాన్ ప్రైమ్

రెడ్ అలర్ట్ సీజన్ 2: ఫైర్ అండ్ యాష్ (చిత్రం) గురువారం జియోహాట్‌స్టార్

ది చీఫ్ (సిరీస్) గురువారం నెట్‌ఫ్లిక్స్

23000 లీవ్స్ (చిత్రం) శుక్రవారం నెట్‌ఫ్లిక్స్

ది కేస్ ఫైల్స్ (సిరీస్) శుక్రవారం నెట్‌ఫ్లిక్స్

ది మోస్ట్ లాంగ్ (సిరీస్) శుక్రవారం నెట్‌ఫ్లిక్స్

ADVERTISEMENT