LOADING...
Toxic: యశ్‌ 'టాక్సిక్‌' గ్లింప్స్‌ రిలీజ్‌.. రయా పాత్రలో రాక్‌స్టార్‌ పవర్‌ షో
యశ్‌ 'టాక్సిక్‌' గ్లింప్స్‌ రిలీజ్‌.. రయా పాత్రలో రాక్‌స్టార్‌ పవర్‌ షో

Toxic: యశ్‌ 'టాక్సిక్‌' గ్లింప్స్‌ రిలీజ్‌.. రయా పాత్రలో రాక్‌స్టార్‌ పవర్‌ షో

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

'కేజీఎఫ్‌'సిరీస్‌ తర్వాత రాక్‌స్టార్‌ యశ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్‌'. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమాకు 'ఎ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌అప్స్‌'అనే ఉపశీర్షికను పెట్టారు. యశ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా యశ్‌ కొత్త లుక్‌ను విడుదల చేస్తూ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. ఈచిత్రంలో యశ్‌ 'రయా' అనే పాత్రలో కనిపించనున్నట్టు ప్రకటిస్తూ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను షేర్‌ చేశారు. 'ఈ వ్యక్తి అత్యంత ప్రమాదకరం' అంటూ పాత్రను పరిచయం చేసేలా 'టాక్సిక్‌: ఇంట్రడ్యూసింగ్‌ రయా' పేరుతో వీడియోను విడుదల చేశారు. ఆ గ్లింప్స్‌లో హింసతో పాటు మసాలా అంశాలు కూడా ఉండటంతో ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు 

'టాక్సిక్‌' పెద్దలకు సందేశం ఇచ్చే సినిమా

అభిమానులు యశ్‌ లుక్‌ పోస్టర్‌ను విస్తృతంగా షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో యశ్‌తో పాటు ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించనుండగా, ఎలిజిబెత్‌గా హ్యుమా ఖురేషీ, గంగ పాత్రలో నయనతార నటిస్తున్నారు. అలాగే రెబెకా పాత్రలో తారా సుతారియా, మెలిసా పాత్రలో రుక్మిణి వసంత్‌ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే విడుదలైన వీరి ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు మంచి స్పందన పొందాయి. చిన్నారుల కోసం అనేక కథలు తెరకెక్కాయని, అయితే 'టాక్సిక్‌' మాత్రం పెద్దలకు సందేశం ఇచ్చే సినిమా అని యశ్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 యశ్‌ చేసిన ట్వీట్ 

Advertisement