Page Loader
Dheeraj Kumar: బాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు ధీరజ్ కుమార్ కన్నుమూత
బాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు ధీరజ్ కుమార్ కన్నుమూత

Dheeraj Kumar: బాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు ధీరజ్ కుమార్ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిందీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, టెలివిజన్ ప్రొడ్యూసర్ ధీరజ్ కుమార్ (79) బుధవారం ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 11:40 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ధీరజ్ కుమార్ మరణంతో బాలీవుడ్‌, టెలివిజన్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది.

Details

1965లో సినీ రంగ ప్రవేశం

ధీరజ్ కుమార్ తన సినీ ప్రస్థానాన్ని 1965లో ప్రారంభించారు. ఆయన అనేక హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. నటుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత, 'క్రియేటివ్ ఐ' ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి పలు ప్రాచీన సాంస్కృతిక, ఆధ్యాత్మిక టీవీ సీరియల్స్‌ను నిర్మించారు. 'ఓం నమః శివాయ' వంటి సిరీస్‌లతో గుర్తింపు ధీరజ్ కుమార్ నిర్మించిన 'ఓం నమః శివాయ', 'సాయ్ బాబా', 'విష్ణుపురాణ్' వంటి టీవీ సీరియల్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయ‌న నిర్మించిన ధారావాహికలు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేవిగా ఉండేవి. సీనియర్ నటుడిగా, స్ఫూర్తిదాయక నిర్మాతగా దశాబ్దాల పాటు తెలుగు, హిందీ టెలివిజన్ రంగానికి సేవలందించిన ధీరజ్ కుమార్ మృతి నష్టమేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.