Page Loader
Actor Rajesh: కోలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు రాజేష్ ఇకలేరు
కోలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు రాజేష్ ఇకలేరు

Actor Rajesh: కోలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు రాజేష్ ఇకలేరు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ ప్రముఖ సీనియర్ నటుడు రాజేష్ (75) మే 29, గురువారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఆయన పార్థివ దేహాన్ని చెన్నై రామపురంలోని నివాసంలో సందర్శనార్థం ఉంచగా, అభిమానులు, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. రాజేష్ భార్య జోన్ సిల్వియా గతంలోనే మృతి చెందారు. ఆయనకు దివ్య, దీపక్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Details

రాజేష్ సినీ ప్రస్థానం

డిసెంబర్ 20, 1949న తమిళనాడులోని తిరువారూర్ జిల్లా మన్నార్‌గుడిలో జన్మించిన రాజేష్, సినీ రంగంలోకి ప్రవేశించే ముందు ఒక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనంతరం ఆయన 1974లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'అవల్ ఒరు తొడరకథై' చిత్రంతో సినీ ప్రస్థానం ప్రారంభించారు. 1979లో 'కన్ని పరువతిలే' చిత్రంలో కథానాయకుడిగా ప్రధాన పాత్ర పోషించారు. దాదాపు ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ జీవితంలో 150కి పైగా తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజేష్ మృతి పట్ల తమిళ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.