Satish Shah: సినీ పరిశ్రమలో విషాదం.. 'ఓం శాంతి ఓం' నటుడు కన్నుమూత!
ఈ వార్తాకథనం ఏంటి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సతీష్ షా (74) శనివారం (అక్టోబర్ 25) మధ్యాహ్నం కన్నుమూశారు. బాలీవుడ్, టీవీ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు పొందిన సతీష్ షా కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం మరింత విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన మేనేజర్ మీడియాకు ప్రకటించారు. ప్రస్తుతం సతీష్ షా భౌతికాయం ఆస్పత్రిలోనే ఉంది. అన్ని పార్మిలిటిస్ పూర్తయిన తరువాత, రేపు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు.
Details
సోషల్ మీడియా వేదికగా సంతాపం
ఆయన మృతితో హిందీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ సినీ, టీవీ నటీనటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదిక ద్వారా వారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులర్పిస్తున్నారు. కొంతమంది నటులు ఆస్పత్రికి వెళ్లి ఆయన భౌతికాయాన్ని సందర్శించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ నటుడిగా సతీష్ షా నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఆయన మృతి భారత సినీ ప్రేక్షకులను కలిచి వేసింది.