LOADING...
R Subbalakshmi : ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి ఆర్. సుబ్బలక్ష్మి మృతి
ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి ఆర్. సుబ్బలక్ష్మి మృతి

R Subbalakshmi : ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి ఆర్. సుబ్బలక్ష్మి మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2023
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి సుబ్బలక్ష్మి(R Subbalakshmi) మరణించారు. 87ఏళ్ల సుబ్బలక్ష్మి కొచ్చిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు సౌభాగ్య వెంకటేష్ తన ఇన్ స్టా పేజీ ద్వారా ప్రకటించింది. గత 30 సంవత్సరాల నుంచి తన అమ్మమ్మకే తనకు బలమమని, తన సబ్బును కోల్పోయానంటూ ఆస్పత్రిలోని బెడ్ పై ఉన్న ఫోటోను పంచుకుంది.

Details

ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన తొలి లేడీ కంపోజర్‌గా సుబ్బలక్ష్మి రికార్డు

సుబ్బలక్ష్మి తెలుగు, తమిళ్, మాలయాళ భాషల్లో మొత్తం 70కు పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో కళ్యాణరాముడు, ఏ మాయ చేసావె సినిమాలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక చివరిసారిగా విజయ్‌ 'బీస్ట్‌' సినిమాలో సుబ్బలక్ష్మి కనిపించారు. ఆమె జవహర్ బాలభవన్ లో సంగీత, నాట్య శిక్షకురాలిగా పనిచేశారు. 1951 నుంచి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగినిగా పనిచేశారు. దక్షిణ భారత దేశం నుంచి ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేసిన తొలి లేడీ కంపోజర్‌గా సుబ్బలక్ష్మి రికార్డు సృష్టించారు. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్‌ గానూ పనిచేశారు.