Kulasekhar: టాలీవుడ్‌లో విషాదం.. గీత రచయిత కులశేఖర్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ లో గీత రచయిత కులశేఖర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం గాంధీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
కులశేఖర్ 1971 ఆగస్టు 15న విశాఖపట్నం సమీపంలోని సింహాచలంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు సాహిత్యంపై ఆసక్తి ఉండేది.
స్కూల్లో చదివేటప్పుడు పాటలు రాసి పలు బహుమతులు అందుకున్నారు. జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన కులశేఖర్, తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద శిష్యరికం చేసి గీత రచనలో పరిణతి సాధించారు.
కులశేఖర్ తేజ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన 'చిత్రం' సినిమాతో గీత రచయితగా పరిచయం అయ్యారు.
ఆ తర్వాత 'జయం, ఔనన్నా కాదన్నా, నువ్వు నేను, ఘర్షణ, మృగరాజు వంటి అనేక విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశారు.
Details
సినీ ప్రముఖుల సంతాపం
ఆర్.పి.పట్నాయక్, తేజలతో కలిసి ఆయన అనేక చిత్రాలకు పని చేశారు.
2013లో కాకినాడలో బాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపం చోరీ కేసులో అరెస్టై ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించారు. ఆ సమయంలోనే మానసిక స్థితి సరిగా లేదని వైద్యులు నిర్ధారించారు.
గీత రచనలో బిజీగా ఉన్న సమయంలో కులశేఖర్ 'ప్రేమలేఖ రాశా' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
అయితే ఆ సినిమా విడుదలకు ఆలస్యం కావడం, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కులశేఖర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. సినీ ప్రముఖులు, అభిమానులు కులశేఖర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.