S.S. Rajamouli: అమ్మాయితో ట్రైయాంగిల్ లవ్ స్టోరి.. వివాదంలో స్టార్ డైరక్టర్ రాజమౌళి
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్నేహితుడు యు. శ్రీనివాసరావు రాజమౌళిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో, లేఖ విడుదల చేశాడు.
రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో పేర్కొన్నాడు. రాజమౌళితో 34 ఏళ్ల స్నేహం ఉందని, యమదొంగ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించానని శ్రీనివాస్ వెల్లడించాడు.
సెల్ఫీ వీడియో, లేఖను రాజమౌళి సన్నిహితులకు పంపడంతో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది.
సుమోటోగా కేసు నమోదు చేసి, లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా నిజాలు వెలుగులోకి తీయాలని శ్రీనివాసరావు పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.
Details
ట్రైయాంగిల్ లవ్ స్టోరీ - విడిపోయిన స్నేహం
ఒక అమ్మాయి కారణంగా తమ స్నేహం దూరమైందని, ఆర్య-2 సినిమా తరహాలో ట్రైయాంగిల్ లవ్‌స్టోరీని ఎదుర్కొన్నామని శ్రీనివాస్ వెల్లడించాడు.
రాజమౌళి తనను దూరం పెట్టాలని చెప్పాడని, తాను ఒప్పుకోలేకపోయానని వివరించాడు.
ముగ్గురం కలిసి ఉండాలని అడిగితే, అది సాధ్యపడదని రాజమౌళి చెప్పాడని, చివరికి తాను శాక్రిఫైజ్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు.
ఒకసారి తమ కథను సినిమాగా తెరకెక్కిస్తానని చెప్పిన తర్వాత నుంచే రాజమౌళి తనపై ఒత్తిడి పెంచాడని శ్రీనివాస్ ఆరోపించాడు.
Details
సోషల్ మీడియాలో వైరల్
తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తెలిపిన శ్రీనివాస్, ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసి, లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా నిజాలు బయటకు తీయాలని పోలీసులను కోరాడు.
ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో, సూసైడ్ లేఖలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే ఇప్పటివరకు రాజమౌళి లేదా పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.