Trisha: వ్యక్తిగత జీవితంపై ప్రచారం.. పరోక్షంగా స్పందించిన త్రిష!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో నటి త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా, సినీ, రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే సాధారణంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలపై స్పందించని త్రిష, తాజాగా ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పరోక్షంగా స్పందించినట్లు అభిమానులు భావిస్తున్నారు. త్రిష తన పెంపుడు కుక్క ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్ జత చేశారు. "నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తానని ఆమె రాసుకొచ్చారు. ఎవరినీ నేరుగా ప్రస్తావించకపోయినా, తనపై వస్తున్న రిలేషన్‌షిప్ రూమర్స్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
'మ్యాజికల్ మే' అంటూ మరో పోస్ట్
మే నెల ప్రారంభంలో చేసిన పోస్టు మాదిరిగానే నెలాఖరులోనూ త్రిష మరో ఆసక్తికర పోస్ట్ చేశారు. నెల ప్రారంభంలో "నాకు ఇష్టమైన మంత్ వచ్చేసిందని పేర్కొన్న ఆమె, తాజాగా కొన్ని ఫొటోలను పంచుకుంటూ "ఈ ఏడాది మే నెలను తలచుకున్నప్పుడల్లా నా ముఖంపై చిరునవ్వు వస్తూనే ఉంటుందని రాసుకొచ్చారు. ఈ ఫొటోలకు "మ్యాజికల్ మే" అనే క్యాప్షన్ ఇవ్వడంతో ఆ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాలు
మే నెల ఎందుకు ప్రత్యేకం?
త్రిషకు మే నెల ప్రత్యేకంగా మారడానికి పలు కారణాలు ఉన్నాయి. ఈ నెలలోనే ఆమె పుట్టినరోజు జరుపుకున్నారు. అదే సమయంలో ఆమె సన్నిహిత మిత్రుడిగా భావించే విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల కారణంగా త్రిష పేరు సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అయింది. మరోవైపు ఆమె నటించిన 'కరుప్పు' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.348 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో త్రిష చేసిన తాజా పోస్టులు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండగా, విజయ్‌తో ఆమె రిలేషన్‌పై వస్తున్న ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.