Trisha: రాజకీయ వివాదంలోకి త్రిష పేరు.. నాగేంద్రన్ వ్యాఖ్యలపై లీగల్ స్టేట్‌మెంట్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై విమర్శలు చేస్తూ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో తీవ్ర చర్చకు దారితీశాయి. విజయ్‌పై ఆరోపణలు చేసే క్రమంలో నటి త్రిష పేరును ప్రస్తావించడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో త్రిష తరఫు న్యాయవాది తాజాగా ఒక ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ ప్రకటనను త్రిష స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. త్రిష సూచనల మేరకు ఆమె అడ్వకేట్, అడ్వైజర్ సంయుక్తంగా విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో, "రాజకీయాల్లో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి అగౌరవకరంగా మాట్లాడతారని నా క్లయింట్ ఊహించలేదు. ఆమెకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. రాజకీయ పార్టీల విషయంలో ఆమె ఎప్పుడూ తటస్థంగానే ఉన్నారు.
Details
ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణం
తన ప్రతిభను నటన ద్వారా నిరూపించుకోవాలనుకుంటున్నారు గానీ, ఇలాంటి రాజకీయ వ్యాఖ్యల ద్వారా కాదు. సంబంధంలేని విషయాల్లోకి నా క్లయింట్‌ను లాగొద్దని స్పష్టం చేశారు. ఇక నాగేంద్రన్ వ్యాఖ్యల విషయానికి వస్తే, విలేకరులు సొంతంగా పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయగలరా?" అని విజయ్ విసిరిన సవాల్‌పై ఆయన అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ నాగేంద్రన్, "పాపం ఆయనకు అనుభవం లేదు. ముందుగా త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి, తన కుటుంబంతో అనుబంధాన్ని కొనసాగించాలంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి కేంద్రబిందువయ్యాయి.
Details
ఎవరి మనసును బాధపెట్టే ఉద్దేశం తనకు లేదు
అయితే అనంతరం స్పందించిన నయినార్ నాగేంద్రన్, ఎవరి మనసును బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. చెన్నై (ప్యారిస్)లో విలేకరులతో మాట్లాడుతూ, రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారాన్ని దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. మదురైలో మార్చి 1న నిర్వహించనున్న ఎన్డీయే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని వెల్లడించారు. నటి గురించి చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా, తాను ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని, ఎవరి మనసును నొప్పించకూడదని తాను భావిస్తానని తెలిపారు.