Trisha: ఎన్నికల రోజు తిరుమలలో దర్శమిచ్చిన త్రిష.. విజయ్ విజయం కోసం ప్రార్థించిందా?
ఈ వార్తాకథనం ఏంటి
సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సోమవారం ఉదయం తిరుమలలో శ్రీవారి సేవలో పాల్గొని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయలో స్వామివారిని దర్శించుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు తిరుమలకు వెళ్లడం కొత్త విషయం కాదు. అయితే ఈసారి త్రిష పర్యటనకు ప్రత్యేకత తీసుకొచ్చిన రెండు అంశాలు ఉన్నాయి—ఒకటి ఆమె పుట్టినరోజు కావడం, రెండోది అదే రోజున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటం. త్రిష దర్శనానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారని భావిస్తుండగా, మరికొందరు ఈ పర్యటనకు రాజకీయ కోణం కూడా ఉందని చర్చిస్తున్నారు.
వివరాలు
కొంతకాలంగా విజయ్, త్రిష రిలేషన్ పై రూమర్లు
ఇటీవల తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రి కజగం (టీవీకే) పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎగ్జిట్ పోల్స్‌లో ఈ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశముందని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో విజయ్ పార్టీ విజయాన్ని కోరుకుంటూ త్రిష తిరుమలకు వచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. కొంతకాలంగా విజయ్, త్రిష మధ్య వ్యక్తిగత సంబంధంపై కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య త్రిష ఈ సమయంలో తిరుమల రావడం మరింత చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
పుట్టిన రోజు సందర్భంగా స్వామివారి దర్శనం
అయితే మరోవైపు ఇది పూర్తిగా వ్యక్తిగత ఆధ్యాత్మిక పర్యటన మాత్రమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం కోసం త్రిష తిరుమలకు వచ్చిందని, ఇందులో ఇతర అర్థాలు వెతకాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. మొత్తంగా తమిళనాడు ఎన్నికల ఫలితాల ఉత్కంఠ మధ్య త్రిష తిరుమల పర్యటన ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఇక విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈ ఎన్నికల్లో ఎలా ప్రదర్శన చేస్తుందో మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది.