Venkatesh: వెంకీ బిజీ షెడ్యూల్‌తో త్రివిక్రమ్ సినిమా వాయిదా?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో ప్రస్తుతం వెంకటేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోయబోతున్న సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం మెగాస్టార్ చిరంజీవి సినిమా కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిరంజీవి చిత్రం 'మన శంకర వరప్రసాద్‌గారు'లో వెంకటేష్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వెంకీ పాత్ర షూటింగ్ పూర్తికాకపోవడంతో త్రివిక్రమ్ సినిమా ప్రారంభం వాయిదా పడింది.
Details
30 రోజులపాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొనాలి
సాధారణంగా వెంకటేష్ తన పాత్రను పది రోజుల లోపే ముగించి త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో చేరుతారని అందరూ భావించారు. కానీ అంతకంటే ఎక్కువ సమయం అవసరమైంది. ఇప్పటికే ఇరవై రోజులు షూటింగ్ జరిగినప్పటికీ, ఆయన పాత్ర ఇంకా పూర్తికాలేదు. చిరంజీవి చిత్రం కోసం వెంకటేష్ మొత్తం 30 రోజులపాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొనాల్సి వస్తోంది. ఈ కారణంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కొత్త సినిమా మొదలవడం వాయిదా పడింది.