LOADING...
Trivikram srinivas birthday: పంచ్ కా దాస్.. మాటల మంత్రదండం.. త్రివిక్రమ్ శ్రీనివాస్ 
Trivikram srinivas birthday: పంచ్ కా దాస్.. మాటల మంత్రదండం.. త్రివిక్రమ్ శ్రీనివాస్

Trivikram srinivas birthday: పంచ్ కా దాస్.. మాటల మంత్రదండం.. త్రివిక్రమ్ శ్రీనివాస్ 

వ్రాసిన వారు Stalin
Nov 07, 2023
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్‌లో ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది గోడ కట్టినట్లు, పూల మాల అల్లినట్లు వచ్చే మాటలు, పంచ్ డైలాగులు. టాలీవుడ్‌లో హీరోల స్థాయి ఇమేజ్ ఉన్న దర్శకులు చాలా తక్కువ మంది ఉండగా.. అందులో త్రివిక్రమ్ ఒకరు. మంగళవారం పుట్టినరోజు జరుపుకుంటున్న త్రివిక్రమ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సినిమాల కోసం త్రివిక్రమ్ రాసే మాటలు నిజ జీవితంలో ఉత్ప్రేరకంగా నిలుస్తాయి. అందుకే ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌ను అందరూ గురూజీ అని అంటుంటారు. సాధారణంగా ప్రేక్షకులు హీరోలను బట్టి థియేటర్స్ కు వెళ్తుంటారు. అయితే ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే డైరెక్టర్స్‌ లిస్ట్‌లో త్రివిక్రమ్ ముందు వరుసలో ఉంటారు.

త్రివిక్రమ్

 సినిమా డైలాగులకు సాహిత్యపు విలువలను జోడించిన రైటర్

సినిమా డైలాగులకు సాహిత్యపు విలువలను జోడించిన రైటర్ త్రివిక్రమ్. చాలా మంది ఆయన్ను.. దర్శకుడిగా కంటే.. డైలాగ్ రైటర్‌గానే ఎక్కువ ఇష్టపడుతారు అనడంలో అతిశయోక్తి లేదు. సినిమా డైలాగులను బాధ్యయుతంగా రాసే రైటర్స్‌లో త్రివిక్రమ్ ముందు వరుసలో ఉంటారు. కెరీర్ తొలినాళ్లలో ఆయన చిరునవ్వుతో, నువ్వేకావాలి, నువ్వే నువ్వే సినిమాల్లో ఆయన రాసిన డైలాగులు ఇప్పటికీ పాపులరే అని చెప్పాలి. ఆ డైలాగులు టీవీల్లో వస్తే.. కాసేపు ఆగి మరి చూస్తుంటాం. ఆ తర్వాత వచ్చిన జల్సా, అతడు, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, 's/oసత్యమూర్తి సినిమాల్లో ఆయన రాసిన మాటలు కుటుంబ విలువలతో కూడి ఉంటాయి. ప్రతి గుండేను తట్టి లేపుతాయి. తండ్రిపై ప్రేమను, కుటుంబంపై మమకారాన్ని, సమాజంపై బాధ్యతను తెలియజేస్తాయి.