Page Loader
Mangalavaram Review: మంగళవారం మూవీ రివ్యూ.. పాయల్ రాజ్‌పుత్ హిట్ కొట్టిందా..?
మంగళవారం మూవీ రివ్యూ.. పాయల్ రాజ్‌పుత్ హిట్ కొట్టిందా..?

Mangalavaram Review: మంగళవారం మూవీ రివ్యూ.. పాయల్ రాజ్‌పుత్ హిట్ కొట్టిందా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2023
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్, డైరక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్‌లో 'మంగళవారం' మూవీ వచ్చింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్‌లో శుక్రవారం విడుదలైంది. ఇందులో చైతన్య కృష్ణ, శ్రీ తేజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ రివ్యూతో పాయల్ రాజ్ పుత్ హిట్ కొట్టిందా? లేదా? అన్నది తెలుసుకుందాం. మహాలక్ష్మీపురంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా గోడమీద ఉన్న కొన్ని రాతలు ప్రత్యక్షమవుతాయి. ఆ గోడ మీద రాసిన పేర్లలో ఉన్న వ్యక్తులు చనిపోతారు. మళ్లీ మంగళవారం నాడే మరో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో చనిపోతారు. మహాలక్ష్మమ్మకు ఇష్టమైన మంగళవారం నాడే అక్రమ సంబంధం పెట్టుకున్నవారు చనిపోతారు.

Details

యూత్ ను మెప్పించిన పాయల్ రాజ్ పుత్

అయితే ఈ హత్యల వెనుక రహస్యం ఏమిటీ? ఈ హ్యతలకు శైలుకు(పాయల్ రాజ్‌పుత్) సంబంధం ఉందా? మహాలక్షీపురం నుంచి ఆమెను వెలివేయడానికి కారణం ఏమిటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌, హార‌ర్‌, రివేంజ్, తో పాటు ఓ మెసేజ్‌ను కూడా ఈ సినిమా ద్వారా ఆడియెన్స్‌కు అందించే ప్ర‌య‌త్నం దర్శకుడు అజయ్ భూపతి చేశాడు. ఈ సినిమా మొత్తాన్ని పాయల్ తన భుజస్కంధాల మీద నడిపించినట్లు అనిపించింది. ఇందులో మితీమిరిన శృంగార కోరకలు ఫ్యామిలీ అడియన్స్ ను ఇబ్బంది పెట్టొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. ఎస్ఐగా నందితా శ్వేత యాక్టింగ్ ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ఈ సినిమా యూత్ ఆడియన్స్ మెప్పించే అవకాశం ఉంది.