LOADING...
Vijay: విడాకుల కేసులో ట్విస్ట్.. భరణంపై విజయ్, సంగీత మధ్య విభేదాలు
విడాకుల కేసులో ట్విస్ట్.. భరణంపై విజయ్, సంగీత మధ్య విభేదాలు

Vijay: విడాకుల కేసులో ట్విస్ట్.. భరణంపై విజయ్, సంగీత మధ్య విభేదాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2026
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్, ఆయన భార్య సంగీత మధ్య విడాకుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆస్తుల పంపకాల విషయంలో ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ కేసు సోమవారం చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్న ఈ జంట మధ్య ప్రస్తుతం భరణం అంశమే ప్రధాన అడ్డంకిగా నిలిచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, సంగీత తనతో పాటు కుమారుడు, కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భరణంగా సుమారు రూ.250 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన ఆస్తుల ఆధారంగా ఈ మొత్తం కోరుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

వివరాలు

రూ.35 కోట్లు చెల్లించేందుకు సిద్ధం

మరోవైపు, విజయ్ మాత్రం రూ.35 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని, పిల్లల పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ అంశంపై శనివారం ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. ఇవాళ విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పటికీ, రాజకీయ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావాలని విజయ్ తరఫు న్యాయవాదులు ఏప్రిల్ 17న కోర్టును కోరారు.

వివరాలు

మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన సంగీత

మరోవైపు, విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు చెన్నై నీలాంగరైలోని తమ నివాసంలోనే కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలని సంగీత మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై కూడా కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాదాపు 25 ఏళ్ల వైవాహిక జీవితం ఇలా ముగింపు దశకు చేరుకోవడం అభిమానుల్లో నిరాశను కలిగిస్తోంది. ఇదే సమయంలో రాజకీయాల్లో కీలక అడుగులు వేస్తున్న విజయ్ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు తమిళనాడులో విస్తృత చర్చకు దారితీశాయి.

Advertisement