Anil Ravipudi: అనిల్ రావిపూడి మల్టీస్టారర్‌లో ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. ఫిక్స్ అయిన బ్యూటీలు వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సెన్సేషన్ సృష్టించారు. ఆ సినిమా విజయానంతరం అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంగా వెంకటేష్, కళ్యాణ్ రామ్లతో మల్టీస్టారర్‌ను ప్రకటించారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన ఆయన, జూన్ 18న సినిమా ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు.
వివరాలు
జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్
జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. అలాగే వచ్చే సంక్రాంతి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన LIK సినిమా ఈవెంట్‌లో హీరోయిన్‌గా కృతి శెట్టిని తీసుకోనున్నట్లు అనిల్ రావిపూడి ప్రకటించారు. దీంతో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటించనున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
కీర్తి సురుష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించే అవకాశం
ఇప్పటికే ఆమెకు కథను వినిపించిన అనిల్ రావిపూడి, ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ కూడా పొందినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్‌లో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా కనిపించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక స్పష్టత రేపు జరగనున్న సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.