Loading...
Udaya Bhanu: 15 ఏళ్ల కల నెరవేరింది.. నిర్మాతగా ఉదయభాను తొలి అడుగు
15 ఏళ్ల కల నెరవేరింది.. నిర్మాతగా ఉదయభాను తొలి అడుగు

Udaya Bhanu: 15 ఏళ్ల కల నెరవేరింది.. నిర్మాతగా ఉదయభాను తొలి అడుగు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

హోస్ట్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను ఇప్పుడు నిర్మాతగానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు చేపట్టి 'పంచనామా' (Panchanama) అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌ సెప్టెంబర్‌ 11 నుంచి జీ5 (ZEE5) ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉదయభాను తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

వివరాలు 

15 ఏళ్లుగా నిర్మాత కావాలనే కల

ఈవెంట్‌కు అసలు భావోద్వేగానికి లోనుకాకూడదనే ఉద్దేశంతో వచ్చానని,కానీ తన భావాలను నియంత్రించుకోలేకపోతున్నానని ఉదయభాను చెప్పారు.

నిర్మాతగా మారాలనే ఆలోచన తనలో దాదాపు 15 ఏళ్లుగా ఉందని తెలిపారు. ''నా కెరీర్‌ టెలివిజన్‌తోనే మొదలైంది.

అదే టెలివిజన్‌ ద్వారా ఉదయభాను కాస్తా అందరి హృదయాల్లో హృదయభానుగా మారింది.

అందుకే నిర్మాతగా నా తొలి అడుగును కూడా టెలివిజన్‌ రంగం నుంచే వేయాలని నిర్ణయించుకున్నాను.

ఇందుకోసం 15 సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశాను. మంచి కంటెంట్‌ ఉందని చెప్పి చాలామందిని కలిశాను.

అయితే ఏదీ ముందుకు సాగలేదు'' అని ఆమె వివరించారు. తనతో కలిసి పనిచేస్తామని చెప్పినవారు.. వచ్చే నెల, వచ్చే వారం అంటూ కాలం గడిపారని ఉదయభాను గుర్తుచేసుకున్నారు.

వివరాలు 

15 ఏళ్లుగా నిర్మాత కావాలనే కల

అలా చూస్తుండగానే 15 ఏళ్లు గడిచిపోయాయని చెప్పారు. ఇంత సమయం ఎందుకు పట్టిందనే ప్రశ్నకు తన దగ్గర కూడా సమాధానం లేదన్నారు.

''అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కల గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ప్రశాంతంగా రెండు గంటలు కూడా నిద్రపోలేని రోజులు ఎన్నో ఉన్నాయి. నా కలను సాకారం చేసే అవకాశం ఇచ్చి జీ5 దానికి ప్రాణం పోసింది. అందుకు నేను వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను'' అని ఉదయభాను కృతజ్ఞతలు తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

స్టార్ కుటుంబం నుంచి రాలేదు..

తాను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే పరిశ్రమలోకి అడుగుపెట్టానని ఉదయభాను చెప్పారు.

కేవలం 12 ఏళ్ల వయసులో మైక్‌ పట్టుకుని తన ప్రయాణాన్ని ప్రారంభించానని, స్వయంగా ఒక్కో విషయాన్ని నేర్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు.

''నా దగ్గర సొంత స్టూడియోలు లేవు. నేను ఏ పెద్ద స్టార్‌ కుటుంబంలోనూ పుట్టలేదు. నా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వచ్చాను. ఈ రోజు నేను నిర్వహించిన కార్యక్రమానికి రావాలని ఏ అగ్రహీరోను పిలిచినా వారు రావడానికి సిద్ధంగా ఉండేవారు. కానీ నా జీవితంలో అసలైన బలం ప్రేక్షకులే. నా ప్రయాణం మీ మధ్యే సాగింది'' అని ఉదయభాను భావోద్వేగంగా అన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

పడిన ప్రతిసారీ మరింత బలంగా..

తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు. ఎన్నిసార్లు కిందపడినా అంతే ధైర్యంతో మళ్లీ పైకి లేచానన్నారు.

ప్రతి ఎదురుదెబ్బ తనలో మరింత పట్టుదలను పెంచిందని పేర్కొన్నారు.

''నేను ఎన్ని సార్లు కిందపడ్డానో.. అన్నిసార్లు ధైర్యంగా ముందుకు సాగాను. పడిపోయిన ప్రతిసారీ రెట్టింపు ఉత్సాహంతో తిరిగి నిలబడ్డాను. ఇప్పుడు కేవలం నడవడం కాదు.. పరిగెత్తడం కూడా నేర్చుకున్నాను'' అని ఉదయభాను తన పోరాటాన్ని వివరించారు.

వివరాలు 

టాలెంట్‌కు నా ప్రొడక్షన్‌ హౌస్‌లో అవకాశం

తనలా ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉదయభాను ప్రొడక్షన్స్‌ను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.

ప్రతిభ ఉన్నవారు తనను సంప్రదించేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుందని చెప్పారు.

''ఎవరైనా టాలెంట్‌తో ముందుకు రావాలనుకుంటే ఉదయభాను ప్రొడక్షన్స్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి'' అని ఆమె స్పష్టం చేశారు.

వివరాలు 

హీరోల రెమ్యునరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

'పంచనామా' సిరీస్‌ కోసం కొంతమంది హీరోలను సంప్రదించినప్పుడు ఎదురైన అనుభవాన్ని కూడా ఉదయభాను పంచుకున్నారు.

తాము అడిగిన రెమ్యునరేషన్‌ ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉందని చెప్పారు.

ఏకంగా సిరీస్‌ మొత్తం నిర్మాణానికి కేటాయించిన బడ్జెట్‌ అంత మొత్తాన్ని పారితోషికంగా అడిగిన హీరోలు కూడా ఉన్నారని ఆమె వెల్లడించారు.

భరత్‌ నివాస్‌ ప్రధాన పాత్రలో..

ఇక 'పంచనామా' విషయానికొస్తే.. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సిరీస్‌ రూపొందింది. ఇందులో భరత్‌ నివాస్‌ ప్రధాన పాత్రలో నటించారు.

మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఉదయభాను తొలిసారిగా నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్‌ సెప్టెంబర్‌ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది.

ADVERTISEMENT