NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Unstoppable4: అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో వచ్చేసింది.. సందడి చేసిన బాలయ్య, బాబు 
    తదుపరి వార్తా కథనం
    Unstoppable4: అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో వచ్చేసింది.. సందడి చేసిన బాలయ్య, బాబు 

    Unstoppable4: అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో వచ్చేసింది.. సందడి చేసిన బాలయ్య, బాబు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 22, 2024
    03:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాప‌బుల్ సీజన్ 4 అక్టోబర్ 25న రాత్రి 8.30 గంటల నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది.

    ఈ సీజన్‌కి గ్రాండ్ ప్రారంభం కావడానికి ఎపిసోడ్‌ 1లోనే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా వచ్చారు.

    ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలైంది. బాలయ్య అభిమానులను అలరిస్తోంది. అభిమానులు వేరు, బాలయ్య వేరు కాదు.. ఇద్దరూ ఒకటే అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌తో ప్రోమో ప్రారంభమైంది.

    ప్రోమోలో బాలయ్య తనదైన స్టైల్‌లో కాస్ట్యూమ్‌ మార్పులతో స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబుతో కలిసి అన్‌స్టాపబుల్‌ బుక్‌పై ప్రమాణం చేయడం మరో ఆకర్షణగా నిలిచింది.

    ఈ ఎపిసోడ్‌లో చంద్రబాబు తన జైలు అనుభవాలను పంచుకున్నారు.

    Details

    డైలాగ్స్ తో నవ్వించిన చంద్రబాబు

    మొదటి రోజు జైలులో ఎలా గడిపానో, అలానే 53 రోజులు గడిపానని, తప్పు చేసిన వారెవ్వరినీ వదిలిపెట్టనని బాబు స్పష్టంచేశారు.

    పవన్ కళ్యాణ్‌తో పొత్తు గురించి, ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల వివరాలను కూడా చంద్రబాబు పంచుకున్నారు.

    జైలు గోడల మధ్య పవన్ కళ్యాణ్‌తో రెండు నిమిషాలు మాట్లాడాం. అది ఒక హిస్టరికల్ డే, నూతన చరిత్ర రాసే సమయస్ఫూర్తి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

    ఇంకా విజయవాడ, వైజాగ్‌ ఫోటోలు చూపించి తన అభిరుచిని పంచుకున్నారు. ఇక ఎన్నో ఆసక్తికర అంశాలు, చర్చలు ఈ ఎపిసోడ్‌లో ఉన్నాయని ప్రోమో ద్వారా అర్థమవుతోంది.

    మరి బాలకృష్ణ - చంద్రబాబు కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫస్ట్ ఎపిసోడ్‌ను మీరూ ఆస్వాదించండి!

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    బాలకృష్ణ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    పవన్ కళ్యాణ్

    Pawankalyan: ఎన్నికల ఫలితాలపై జనసేనాని కామెంట్స్.. "నాకు రాజకీయాల్లో తొలిగెలుపు అని స్పష్టం" భారతదేశం
    NDA meet : చంద్రబాబు పట్టాభిషేకానికి రంగం సిద్ధం.. తరలి రానున్న అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్
    Janasena: జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నిక  జనసేన
    AP Deputy CM: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కి Y-ప్లస్తో ఎస్కార్ట్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ కారు! భారతదేశం

    బాలకృష్ణ

    బాలయ్య 108వ సినిమా టైటిల్ లీక్: ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి  తెలుగు సినిమా
    ఒకే సినిమాలో చిరు, బాలయ్య, నాగ్, వెంకటేశ్ టాలీవుడ్
    బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ పనులు మొదలు: 2024లో షూటింగ్?  తెలుగు సినిమా
    బాలకృష్ణ 108వ సినిమా: టైటిల్ రివీల్ కోసం 108లొకేషన్లు  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025