కబ్జా మూవీ: వందకోట్ల సినిమా 20రోజుల్లోనే ఓటీటీలోకి, స్ట్రీమింగ్ ఎక్కడంటే
ఈ వార్తాకథనం ఏంటి
ఉపేంద్ర హీరోగా వచ్చిన కబ్జా మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. సుదీప్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద కనీస కలెక్షన్లు కూడా రాలేదు.
కేజీఎఫ్ సినిమాను కాపీ కొట్టి తీర్చిదిద్దిన కబ్జా మూవీని, ప్రేక్షకులు తీసుకోలేక పోయారు. రిలీజైన మొదటి రోజు నుండి మొదలైన నెగెటివిటీ, దావానలంలా విస్తరించి కలెక్షన్లకు అడ్డుకట్ట వేసింది.
ఫలితంగా థియేటర్ల వద్ద తుస్సుమంది. ప్రస్తుతం ఈ మూవీ, ఓటీటీలో రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ రెండవ వారంలో రిలీజ్ అవుతుందని అంటున్నారు.
ఇప్పటికైతే ఈ విషయమై అధికారిక సమాచారం రాలేదు కానీ, మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటన రానుందని చెప్పుకుంటున్నారు.
కబ్జా
ఏప్రిల్ 14వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల
కన్నడ భాషలో రూపొందిన కబ్జా మూవీ, తెలుగు, తమిళం, హిందీ, మళయాలం భాషల్లోనూ థియేటర్లలో రిలీజై, ప్రతీచోటా నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
అదలా ఉంచితే, ప్రస్తుతం ఏప్రిల్ 14వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుందని మాటలు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ కి ముందే డిజిటల్ రైట్స్ ని అధిక ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని సమాచారం.
కన్నడ సహా అన్ని భాషల్లోనూ ఒకేసారి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వస్తుందట. శ్రియా శరణ్ హీరోయిన్ గా కనిపించిన కబ్జా మూవీని, ఆర్ చంద్రూ డైరెక్ట్ చేసారు.
ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.