Page Loader
ఉస్తాద్ భగత్ సింగ్: గ్లింప్స్ కన్నా ముందు అదిరిపోయే పోస్టర్ రిలీజ్ 
ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్

ఉస్తాద్ భగత్ సింగ్: గ్లింప్స్ కన్నా ముందు అదిరిపోయే పోస్టర్ రిలీజ్ 

వ్రాసిన వారు Sriram Pranateja
May 11, 2023
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈరోజు పండగ రోజు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజై నేటితో పదకొండేళ్ళు పూర్తయ్యింది. 2012 మే 11న రిలీజైన గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ ను మళ్ళీ విజయాల బాట పట్టించింది. గబ్బర్ సింగ్ తెరకెక్కించిన దర్శకుడు హరీష్ శంకర్, ప్రస్తుతం పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ ఈరోజు సాయంత్రం 4:59గంటలకు విడుదల కానుంది. అంతకన్నా ముందే ఈ సినిమా నుండి పవన్ కళ్యాణ్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. గ్లింప్స్ విడుదలకు ముందు మంచి అప్డేట్ ఇచ్చారంటూ పవన్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పవన్ కళ్యాణ్ లుక్