
Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్‌సింగ్' క్లైమాక్స్ కంప్లీట్.. ఇక రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైందా?
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో 'ఉస్తాద్ భగత్‌సింగ్' (Ustaad Bhagat Singh) చిత్రం ప్రధానంగా నిలుస్తోంది. పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తాజా షెడ్యూల్‌కు సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. ఈ సినిమా క్లైమాక్స్ భాగాన్ని పూర్తి చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన అప్‌డేట్‌లో 'భావోద్వేగాలతో నిండి, ఉత్కంఠభరితంగా ఉండే క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. నబకాంత మాస్టర్ పర్యవేక్షణలో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించాం. పవన్ కల్యాణ్ తమ రాజకీయ భాద్యతలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, సినిమా షూటింగ్‌కి విశేష ప్రాధాన్యత ఇచ్చారు.
Details
మూవీపై భారీ అంచనాలు
'హరిహర వీరమల్లు' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే 'ఉస్తాద్ భగత్‌సింగ్' షూటింగ్‌లోనూ అంతే ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇది ఆయన అంకితభావానికి నిదర్శనమంటూ చిత్రబృందం తెలిపింది. ఈ ప్రకటన సందర్భంగా పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్‌ల మధ్య సెట్‌లో దిగిన ఓ చిత్రాన్ని సోషల్‌మీడియాలో పంచుకుంది. ఈ పోస్ట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇక గతంలో సూపర్‌హిట్ అయిన 'గబ్బర్ సింగ్' తర్వాత ఈ ద్వయం మళ్లీ కలిసే ప్రాజెక్ట్ కావడం వల్ల సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Details
పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, స్పెషల్ వీడియోలు సినిమాపై హైప్‌ను పెంచేశాయి. హీరోయిన్లుగా శ్రీలీల, రాశీఖన్నా నటిస్తున్న ఈ చిత్రానికి త్వరలో విడుదల తేదీ ప్రకటించే అవకాశముందని సమాచారం. ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం, పవన్‌కు మరో బ్లాక్‌బస్టర్‌ను అందించనుందా అన్నది చూడాలి.