LOADING...
vaazha 2 collection: 'వాళా2' బాక్సాఫీస్ సెన్సేషన్.. 17 రోజుల్లో 200 కోట్లు
'వాళా2' బాక్సాఫీస్ సెన్సేషన్.. 17 రోజుల్లో 200 కోట్లు

vaazha 2 collection: 'వాళా2' బాక్సాఫీస్ సెన్సేషన్.. 17 రోజుల్లో 200 కోట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 19, 2026
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది 'వాఝా 2'. కొత్త నటీనటులతో దర్శకుడు సవిన్ S A రూపొందించిన ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విడుదలైన కేవలం 17 రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం మలయాళ సినీ పరిశ్రమలో అరుదైన ఘనతగా నిలిచింది.

వివరాలు

టాప్ చిత్రాల్లో స్థానం

రూ.200 కోట్ల మార్క్ దాటిన 'వాళా 2' మరో రికార్డు కూడా నమోదు చేసింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో ముందుగా లోక చాప్టర్ 1: చంద్ర (రూ.300 కోట్లు) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతL2: ఎంబురాన్, మంజుమేల్ బాయ్స్, అంబాసిడర్ వంటి చిత్రాలు ఉన్నాయి. రూ.200 కోట్ల మార్క్ దాటిన 'వాళా 2' మరో రికార్డు కూడా నమోదు చేసింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో ముందుగా లోక చాప్టర్ 1: చంద్ర (రూ.300 కోట్లు) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతL2: ఎంబురాన్, మంజుమేల్ బాయ్స్, అంబాసిడర్ వంటి చిత్రాలు ఉన్నాయి.

వివరాలు

తెలుగులో విడుదలకు సిద్ధం

'వాళా' చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్ పూర్తి పేరు 'వాజా: బిలియన్ బ్రదర్స్ జీవిత చరిత్ర'. హషీర్, అలన్, అజిన్, వినాయక్ అనే విద్యార్థుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 2న మలయాళంలో విడుదలై మొదటి రోజునుంచే హిట్ టాక్‌ను అందుకుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై నిర్మాత సాహు గారపతి ఈ సినిమాను ఏప్రిల్ 24న తెలుగులో విడుదల చేయనున్నారు. మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో, తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement