తదుపరి వార్తా కథనం
MAD Square Song : 'మ్యాడ్ స్క్వేర్' నుంచి 'వచ్చార్రోయ్' సాంగ్ విడుదల.. హైప్ పెంచుతున్న ట్యూన్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 18, 2025
05:44 pm
ఈ వార్తాకథనం ఏంటి
సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన 'మ్యాడ్' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'మ్యాడ్ స్క్వేర్' నుంచి తాజా అప్డేట్ వచ్చింది.
మార్చి 28న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా నుంచి 'వచ్చార్రోయ్' అనే పాటను విడుదల చేశారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
ఇప్పటికే టీజర్, ఇతర పాటలు విడుదల కాగా, తాజాగా వచ్చిన 'వచ్చార్రోయ్' సాంగ్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.