
Vadde Naveen : నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పుడు స్టార్ హీరో
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోలు కాలగమణంలో కనిపించకుండా పోయారు. సినిమా రంగానికి దూరంగా జీవితం గడిపిన స్టార్లు చాలామందే ఉన్నారు. వారిలో జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి వారు విలన్ పాత్రలతో రీ ఎంట్రీ ఇచ్చి తమదైన ముద్ర వేశారు. ఈ కోవలో వడ్డే నవీన్ కూడా మళ్లీ నటుడిగా రంగప్రవేశం చేస్తారని అనుకున్నారు. ఇప్పుడు మరలా ఆయన పేరు వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే, ఒకప్పుడు యూత్‌ఫుల్ ప్రేమకథలు, కుటుంబ భావోద్వేగాలతో కూడిన సినిమాల్లో వరుసగా హిట్లు అందుకున్న వడ్డే నవీన్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉండేది. కానీ మాస్ ఇమేజ్ లేకపోవడం,ట్రెండ్ మారడం వల్ల ఆయన్ని సినిమాలు పట్టించుకోలేదు.
వివరాలు
'వడ్డే క్రియేషన్స్' అనే బ్యానర్ పై కొత్త నిర్మాణ సంస్థ
దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యారు. చివరిసారిగా 2016లో విడుదలైన 'ఎటాక్' సినిమాలో కనిపించారు. ఆ తర్వాత తెరపై కనిపించలేదు. ఇప్పుడు ఆయన తిరిగి వెండితెరకు వస్తున్నారని చర్చ జరుగుతోంది. విలన్ పాత్రలో రీ ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు వచ్చినా, నిజానికి ఆయన నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 'వడ్డే క్రియేషన్స్' అనే బ్యానర్ పై కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థతో కొత్త సినిమా ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. తన అభిమానులు నటుడిగా ఆయనను తెరపై మళ్లీ చూడాలనే ఆసక్తితో ఎదురుచూస్తున్నా, ఆయన నిర్మాతగా మారడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వివరాలు
ఇండస్ట్రీకి దూరం.. వ్యాపార రంగంలో
చాలా కాలం తర్వాత వడ్డే నవీన్ ఈ విధంగా పరిశ్రమకు తిరిగి రావడం ఆయన అభిమానులకు ఖచ్చితంగా ఆనందకరమైన విషయం. నటన కంటే వ్యాపార రంగంలోను ఆయన మంచి స్థిరత సాధించారు. గతకొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమయంలో ఆయన పూర్తిగా తన వ్యాపారాల్లోనే నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఆయన ఏ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తారో వేచి చూడాల్సిందే.