Loading...
Vadde Naveen: వడ్డే నవీన్ కంబ్యాక్ మూవీ ఓటీటీలోకి.. ఇప్పుడు ఎక్కడ చూడొచ్చంటే!
వడ్డే నవీన్ కంబ్యాక్ మూవీ ఓటీటీలోకి.. ఇప్పుడు ఎక్కడ చూడొచ్చంటే!

Vadde Naveen: వడ్డే నవీన్ కంబ్యాక్ మూవీ ఓటీటీలోకి.. ఇప్పుడు ఎక్కడ చూడొచ్చంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్, చాలా కాలం తర్వాత 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఆయన, సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానుల మద్దతును కొనసాగించుకుంటూ వచ్చారు. దర్శకుడు కమల్ తేజ్ నార్ల తెరకెక్కించిన ఈ చిత్రంలో గ్లామరస్ హీరోయిన్ రాశీ సింగ్ కథానాయికగా నటించింది. వడ్డే నవీన్‌కు ఇది కంబ్యాక్ మూవీగా మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

వివరాలు

నేటి నుంచి స్ట్రీమింగ్

ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ వేదికపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, నేటి నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

వడ్డే నవీన్ సినిమాలను ఇష్టపడే అభిమానులు లేదా ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు జీ5లో వీక్షించవచ్చు.

ఈ చిత్రానికి కల్యాణ్ నాయక్ సంగీతం అందించగా, వడ్డే నవీన్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు.

ADVERTISEMENT