Page Loader
Vadhuvu Web Series Review: 'వధువు' రివ్యూ.. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
'వధువు' రివ్యూ.. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Vadhuvu Web Series Review: 'వధువు' రివ్యూ.. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2023
06:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉయ్యాల జంపాల మూవీతో వెండితెరపై అవికా గోర్(Avika Gore)ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురుతో ఫేమస్ అయిన ఆమె, ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం 'వధువు'(Vadhuvu)అనే వెబ్ సిరీస్‌లో నటించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తాజాగా విడుదలైన ఈ సిరీస్ అంచనాలను అందుకుందా లేదో ఓ సారి చూద్దాం. ఒక పెళ్లి ఆగిపోయి రెండో పెళ్లికి సిద్ధమైన ఇందు(అవికా గోర్) ఈసారి తన పెళ్లికి ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలని భావిస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు అత్తారింట్లో సమస్యలు మొదలవుతాయి. తన భర్త ఆనం(నందు) తన మరిది ఆర్య(అలీ రెజా), తన మెట్టినింట్లో అందరి వెనక ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది.

Details

థ్రిల్లర్ డ్రామాగా సాగిన 'వధువు' వెబ్ సిరీస్

మరి వారందరి వెనుక ఉన్న రహస్యాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఆర్య పాత్రలో అలీ రాజా ఆకట్టుకున్నాడు. ఇక ఆనంద్ పాత్రలో నందు ఒదిగిపోయాడనే చెప్పాలి. వధువు ఇందు పాత్రలో అవిక్ గోర్ తన నటనతో ప్రాణం పోసింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రీనివాస్ మద్దూరి సంగీతం, రామ్ కె మహేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఊహకందని ట్విస్ట్‌లతో సాగే థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్‌గా వధువు నిలిచింది.