LOADING...
Varanasi : 'వారణాసి' మేకింగ్‌ గ్లింప్స్‌ వైరల్‌.. రాజమౌళి విజన్‌కు నెటిజన్లు ఫిదా!
'వారణాసి' మేకింగ్‌ గ్లింప్స్‌ వైరల్‌.. రాజమౌళి విజన్‌కు నెటిజన్లు ఫిదా!

Varanasi : 'వారణాసి' మేకింగ్‌ గ్లింప్స్‌ వైరల్‌.. రాజమౌళి విజన్‌కు నెటిజన్లు ఫిదా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్. రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్‌ ప్రాజెక్ట్‌ వారణాసి (SSMB29) షూటింగ్‌ దశలోనే కొత్త రికార్డులు సృష్టిస్తోంది. విదేశీ లొకేషన్లతో పాటు హైదరాబాద్‌లోనూ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక మోషన్‌ పిక్చర్‌ స్టూడియోలో హాలీవుడ్‌ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా వర్చువల్‌ ప్రొడక్షన్‌, మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీలను ఉపయోగించినట్టు తెలిసింది.

Details

విజువల్ వండర్ గా నిలిచేలా వారణాసి

అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆసక్తికర అంశం ఏంటంటే—ఈ కథకు భారతీయ ఇతిహాసం రామయణంతో బలమైన అనుసంధానం ఉండబోతోందట. రామాయణ కాలానికి చెందిన కొన్ని ఎలిమెంట్స్‌ను కథలో కీలక మలుపుగా మిళితం చేసినట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు, ఫోటోల ఆధారంగా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కథా గమనాన్ని మార్చే ముఖ్య సన్నివేశం రామాయణ నేపథ్యంతో ముడిపడి ఉంటుందని ప్రచారం సాగుతోంది. సాంకేతిక పరంగా రాజమౌళి తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే, ఆయన గత విజువల్‌ అద్భుతాలు బహుబలి, ఆర్ఆర్ఆర్ మించేలా ఈ చిత్రం రూపొందుతోందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. విజువల్‌ వండర్‌గా నిలిచేలా వారణాసి (SSMB29) రూపుదిద్దుకుంటోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement