Varanasi: 'వారణాసి' నుంచి ప్రియాంక లుక్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె 'మందాకిని' పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా షూటింగ్ లొకేషన్‌లో తీసిన ఆమె కొత్త స్టిల్స్‌ను దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోలకు 'ఆమె నవ్వితే అందం.. నవ్వకపోతే నిప్పుకణిక' అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
వివరాలు
4 నెలలుగా 'వారణాసి' షూట్‌లో ప్రియాంక చోప్రా..
మరోవైపు హీరో మహేష్‌బాబు కూడా ప్రియాంకకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
'మా ఒకే ఒక్క మందాకినికి హ్యాపీ బర్త్‌డే' అంటూ ఆయన చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే, ప్రియాంక చోప్రా గత 14 నెలలుగా 'వారణాసి' చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
ఈ సినిమా కోసం తాను ఎన్నో సవాళ్లతో కూడిన యాక్షన్ సన్నివేశాల్లో నటించానని, ముఖ్యంగా అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ చేశానని ఆమె ఇటీవల వెల్లడించారు.
వివరాలు
ప్రచార కార్యక్రమాలు ప్రారంభించేందుకు సన్నాహాలు..
ఈ చిత్రంలో మహేష్‌బాబు రుద్ర, శ్రీరాముడు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
ప్రపంచాన్ని మాత్రమే కాకుండా కాలాలను కూడా దాటుకుంటూ సాగే ఓ సాహసికుడి కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.
భారీ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న 'వారణాసి' చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, అనంతరం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.