Loading...
Varanasi : వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్.. రూ.275 కోట్ల ఆఫర్
రూ.275 కోట్ల ఆఫర్

Varanasi : వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్.. రూ.275 కోట్ల ఆఫర్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో 'వారణాసి' థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. మహేష్ బాబు, ఎస్‌.ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై విడుదలకు ముందే బిజినెస్ వర్గాల్లో భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థలు హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు పోటీలో ఉన్నట్లు సమాచారం. ఈ మూడు సంస్థలు కలిసి రెండు తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం సుమారు రూ.275 కోట్ల వరకు ఆఫర్లు ఇస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వివరాలు 

విజయదశమి తర్వాత తుది నిర్ణయం

ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన రాజమౌళి చిత్రంగా 'ఆర్‌ఆర్‌ఆర్'కు రికార్డు ఉంది.

ఆ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు సుమారు రూ.225 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.

ఇప్పుడు 'వారణాసి' కోసం వినిపిస్తున్న రూ.275 కోట్ల ఆఫర్ నిజమైతే.. 'ఆర్‌ఆర్‌ఆర్' రికార్డును రూ.50 కోట్లకు పైగా అధిగమించినట్లవుతుంది.

అయితే 'వారణాసి' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ డీల్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

మూడు ప్రముఖ సంస్థలు ఒకదానికొకటి మించి ఆఫర్లు ఇస్తుండటంతో.. విజయదశమి తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌పై అంచనాలు 

మరోవైపు రాజమౌళి సినిమాలతో గతంలోనూ రెగ్యులర్‌గా వ్యాపారం చేసిన ఓ ప్రముఖ సంస్థ కూడా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదింపులు జరుపుతూ.. సినిమా బిజినెస్ తాము చూసుకుంటామని, పంపిణీ హక్కులు తమకే దక్కుతాయని హామీలు ఇస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక తుది డీల్ ఖరారయ్యే సమయానికి 'వారణాసి' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నప్పటికీ ఈ స్థాయిలో బిజినెస్ ఆసక్తి కనిపించడం మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌పై ఉన్న అంచనాలను తెలియజేస్తోంది.

ADVERTISEMENT