Varanasi Movie: 'వారణాసి' జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం: మహేశ్‌బాబు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి నటుడి కెరీర్‌లో ఒకసారి మాత్రమే దక్కే ఓ ప్రత్యేక చిత్రం, గుర్తుండిపోయే ఓ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. నాకు 'వారణాసి' అలాంటిదే' అంటున్నారు మహేష్ బాబు.మహేష్ బాబు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్-అడ్వెంచర్ సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా జోన్స్ హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, కార్తికేయ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్‌బాబు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడారు. తమపై వారి ప్రేమ, ఆదరణ ఎన్నటికీ మరచిపోలేనిదని అన్నారు.
వివరాలు
నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది
''మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసి చాలా రోజులు అయ్యింది. ఈ ఈవెంట్ ద్వారా మళ్లీ మీ ముందుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను సాధారణంగానే వస్తానని అనుకున్నాను. కానీ రాజమౌళిగారు ఇలా ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకొచ్చారు. నాన్న కృష్ణగారు తరచూ ఒకే మాట చెప్పేవారు—'ఒకసారి పౌరాణిక పాత్రలో నిన్ను చూడాలి' అని. ఆయన చెప్పిన మాటను అప్పట్లో పట్టించుకోలేకపోయాను. కానీ ఇప్పుడు ఆయన ఆశీస్సులు మనతోనే ఉన్నాయి... అవే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి.''
వివరాలు
2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు..
'వారణాసి' నా కలల సినిమా. జీవితంలో ఒక్కసారి దక్కే అవకాశం. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. ఈ సినిమా చూసినప్పుడు అందరూ గర్వపడాలి—ప్రత్యేకంగా నా దర్శకుడు రాజమౌళిగారు. 'వారణాసి' విడుదలైనప్పుడు దేశం మొత్తానికి ఇది ప్రౌడ్ మోమెంట్ అవుతుంది. ఇది కేవలం టైటిల్ ప్రకటనే... మిగతావి ఎలా ఉంటాయో ముందే ఊహించుకోండి. మీ మద్దతు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే ప్రేమ, అభిమానం మాటల్లో చెప్పలేనంత పెద్దది. ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్ శాఖకు ధన్యవాదాలు'' అని అన్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మాగ్నమ్-ఓపస్ 2027 వేసవిలో ప్రేక్షకులను చేరుకోనుంది.