Priyanka Chopra: రూ.1300 కోట్ల బడ్జెట్‌తో 'వారణాసి'.. నీ వల్లే బడ్జెట్ పెరిగిందా? కపిల్ ప్రశ్నకు ప్రియాంక రియాక్షన్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' కొత్త సీజన్‌కు ఘనంగా తెరలేచింది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'వారణాసి' (Varanasi) బడ్జెట్‌పై ఆమె చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచాయి.
Details
వారణాసి బడ్జెట్ రూ.1300 కోట్లా?
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి' బడ్జెట్‌పై ఇప్పటికే అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కపిల్ శర్మ షోలో జరిగిన సరదా సంభాషణలో ప్రియాంక చోప్రా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్టే అయ్యింది. షోలో కపిల్ శర్మ మాట్లాడుతూ, "ప్రియాంక ఏం చేసినా అది భారీ స్థాయిలోనే ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు. ఆయన సినిమాల బడ్జెట్లు మనకు తెలిసిందే. కానీ మీరు ఇందులో ఉండటంతో ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.1300 కోట్లు అయ్యిందని విన్నాను. సినిమా కోసం ఖర్చా, లేక వారణాసిలో ఉన్నవాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకా?" అంటూ చమత్కరించాడు.
Details
నీ వల్లే బడ్జెట్ పెరిగిందా?
ఈ ప్రశ్న వినగానే ఆడియన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ప్రియాంక మాత్రం చిరునవ్వుతో "అవును" అంటూ సమాధానం ఇవ్వడంతో, ఈ సినిమా బడ్జెట్ రూ.1300 కోట్లు అన్న ప్రచారం నిజానికి దగ్గరగానే ఉందని అభిమానులు భావిస్తున్నారు. అక్కడితో ఆగని కపిల్ శర్మ, తనదైన శైలిలో మరో సెటైర్ వేశాడు. "అసలు బడ్జెట్ అంత ఎక్కువేమీ కాకపోవచ్చు. మీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చాక, మీ రెమ్యునరేషన్ వల్లే బడ్జెట్ పెరిగిపోయిందా?" అంటూ నవ్వించాడు. దీనికి ప్రియాంక కూడా వెంటనే స్పందిస్తూ, "అంటే సగం బడ్జెట్ నా బ్యాంక్ అకౌంట్‌లో పడిందని మీరు పరోక్షంగా అంటున్నారా?" అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చింది. ఈ డైలాగ్‌తో స్టూడియో మొత్తం నవ్వులతో మార్మోగింది.
Details
కట్టప్ప సీక్రెట్‌లా కథను అడగొద్దు!
ఈ షోలో పాల్గొన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ 'వారణాసి' సినిమా కథ గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, కపిల్ వెంటనే మధ్యలోకి వచ్చి, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయం రెండో పార్ట్ వచ్చే వరకూ ఎవరికీ తెలియలేదు. రాజమౌళి సినిమాల విషయంలో ఇప్పుడే ఏం తెలుసుకోలేం" అంటూ జోక్ చేశాడు. దీంతో కథ గురించి ఎలాంటి హింట్ కూడా ఇవ్వకుండా విషయాన్ని దాటేశారు.
Details
'వారణాసి' సినిమా విశేషాలు
'వారణాసి' చిత్రంలో మహేష్ బాబు (రుద్ర), ప్రియాంక చోప్రా (మందాకిని), పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ) కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోని వివిధ ఖండాలు, విభిన్న కాలాల నేపథ్యంలో సాగే భారీ స్థాయి అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా, కపిల్ శర్మ షోలో ప్రియాంక చేసిన వ్యాఖ్యలతో 'వారణాసి' బడ్జెట్‌పై నడుస్తున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది.