#varunlav: వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్.. డీల్ ఎన్ని కోట్లంటే ?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం హాట్ టాపిగా మారింది. ఈ క్రమంలో వీరి వివాహం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని ప్రచారం జరుగుతోంది.
సెలబ్రిటీల పెళ్లిళ్లను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ చేయడం ఈ మధ్య కాలంలో ట్రెండ్‌గా మారింది. సినిమా ప్రముఖ పెళ్లిళ్లకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
ఈ క్రమంలో సెలబ్రిటీల ఈవెంట్లను స్ట్రీమింగ్ చేసేందుకు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు పోటీ పడుతుంటాయి.
తాజాగా టాలీవుడ్‌లో హీరో వరుణ్ తేజ్, హీరోయిన లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టస్కానీలోని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రిసెప్షన్‌కు సినీ ప్రముఖులందరూ హాజరయ్యారు.
ఓటీటీ
రూ.20కోట్లకు నెట్‌ఫ్లిక్స్ డీల్?
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ప్రత్యేక ప్రసార హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.20కోట్లకు పొందినట్లు తెలుస్తోంది.
పెళ్లిని షూట్ చేసి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేస్తామని నాగబాబుకు నెట్‌ఫ్లిక్స్ ప్రతిపాదించినట్లు సమాచారం. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇంతకుముందు నెట్‌ఫ్లిక్స్ నయనతార, విఘ్నేష్ శివన్ వివాహం స్ట్రీమింగ్ హక్కులను పొందింది.
పెళ్లి వీడియోలను ఇస్టానుసారంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, నెట్‌ఫ్లిక్స్ వారి వివాహ స్ట్రీమింగ్ కాంట్రాక్టును రద్దు చేసింది.
ఇదే క్రమంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియోలను నాగబాబు కుమార్తె నిహారిక యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.
దీంతో నెట్‌ఫ్లిక్స్ వారి వివాహాన్ని స్ట్రీమింగ్ చేస్తుందా? లేక రద్దు చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది.