Loading...
Varun Tej Son : వరుణ్‌ తేజ్‌-లావణ్య కొడుకు వాయువ్‌ ఫేస్‌ రివీల్‌.. ఫస్ట్‌ బర్త్‌డేకే సర్‌ప్రైజ్‌!
వరుణ్‌ తేజ్‌-లావణ్య కొడుకు వాయువ్‌ ఫేస్‌ రివీల్‌.. ఫస్ట్‌ బర్త్‌డేకే సర్‌ప్రైజ్‌!

Varun Tej Son : వరుణ్‌ తేజ్‌-లావణ్య కొడుకు వాయువ్‌ ఫేస్‌ రివీల్‌.. ఫస్ట్‌ బర్త్‌డేకే సర్‌ప్రైజ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి దంపతులు తమ అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఇన్నాళ్లుగా ఎంతో గోప్యంగా ఉంచిన తమ కుమారుడు వాయువ్‌ ముఖాన్ని తొలిసారి అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేశారు. వాయువ్‌ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ క్యూట్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో వాయువ్‌కు సంబంధించిన కొన్ని అందమైన ఫొటోలను పంచుకున్నారు. తండ్రి ఒడిలో హాయిగా ఉన్న చిన్నారి.. తల్లితో కలిసి నవ్వుతున్న క్షణాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వాయువ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో మెగా అభిమానులు చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

వివరాలు

కొడుకుపై వరుణ్‌ తేజ్‌ ఎమోషనల్‌ పోస్ట్

కొడుకు మొదటి పుట్టినరోజు సందర్భంగా వరుణ్‌ తేజ్‌ ఎంతో భావోద్వేగంతో ప్రత్యేక సందేశాన్ని రాశారు.

వాయువ్‌ తన జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రపంచమే మరింత అందంగా మారిందని తెలిపారు. తండ్రిగా మారడం తన జీవితంలోనే అత్యంత గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు.

వాయువ్‌ను మొదటిసారి కళ్లతో చూసే ముందే అతడిపై ప్రేమ పెంచుకున్నానంటూ వరుణ్‌ తేజ్‌ తన మనసులోని భావాలను పంచుకున్నారు.

కొడుకుకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఎప్పటికీ తన ప్రేమ అలాగే ఉంటుందని పేర్కొన్నారు.

వివరాలు

'నన్ను తల్లిగా ఎంచుకున్నందుకు థ్యాంక్యూ'

లావణ్య త్రిపాఠి కూడా తన కుమారుడు వాయువ్‌ కోసం ఎమోషనల్‌ నోట్‌ పంచుకున్నారు. తనను తల్లిగా ఎంచుకున్నందుకు వాయువ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

తన జీవితంలోకి వాయువ్‌ రాకముందు ప్రేమ అంటే తనకు తెలుసని అనుకున్నానని.. కానీ అతడు పుట్టిన తర్వాత ప్రేమకు మరో కొత్త అర్థం తెలిసిందని లావణ్య పేర్కొన్నారు.

తనకు బయట జీవిస్తున్న మరో హృదయం వాయువ్‌ అంటూ కొడుకుపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. చిన్నారి నవ్వులు, పసి చేతుల స్పర్శలు, కౌగిలింతలు తమ ఇంట్లో ఎనలేని ఆనందాన్ని నింపాయని లావణ్య తెలిపారు.

తమ జీవితంలో వాయువ్‌ చీకటిలో చంద్రుడిలా, వెలుగునిచ్చే సూర్యుడిలా మారాడని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు.

ADVERTISEMENT

వివరాలు

వాయువ్‌కు మెగా కుటుంబం, సెలబ్రిటీల విషెస్

వాయువ్‌ ఫొటోలు బయటకు రావడంతో మెగా కుటుంబ సభ్యులు కూడా స్పందించారు.

నిహారిక కొణిదెల చిన్నారిని ఎంతో ముద్దుగా పొగుడుతూ.. తాను చూసిన అత్యంత అందమైన, హ్యాండ్సమ్‌ బాయ్‌ అంటూ కామెంట్‌ చేశారు.

రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కొణిదెల కూడా వాయువ్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగా కుటుంబంతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా చిన్నారి ఫొటోలపై స్పందిస్తూ విషెస్‌ చెప్పారు.

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, హీరోయిన్లు రీతూ వర్మ, అనుపమ పరమేశ్వరన్‌, రుహానీ శర్మ తదితరులు కూడా వాయువ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ADVERTISEMENT