
మెగాస్టార్ ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్‌లో మెగా కుటుంబం
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
జూన్ లో అంగరంగ వైభవంగా ఎంగేజ్ మెంట్ జరుపుకున్న ఈ జంట త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు.
ఇప్పటికే పెళ్లి పనుల ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఫ్రీ వెడ్డింగ్ వేడుక వైభవంగా జరిగింది.
ఈ వేడుకులను మెగా కుటుంబంలోని సభ్యులంతా హజరయ్యారు.
ఈ మేరకు మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు.
Details
ఫ్రీ వెడ్డింగ్ షోలో మెగా కుటుంబం
ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి-సురేఖ దంపతులు, నాగబాబు-పద్మజ దంపతులు, చిరంజీవి ఇద్దరు చెల్లెల్లు, వారి భర్తలు, రామ్ చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల, నిహారిక కొణిదెల, చిరంజీవి తల్లి అంజనాదేవి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజీ షెడ్యూల్ కారణంగా ఈ వేడుకకు హాజరు కాలేదని తెలుస్తోంది.
ఇప్పటికే వివాహ దుస్తుల కోసం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి షాపింగ్ పూర్తి చేశారట.
ఇటలీలో ఓ ప్యాలెస్‌లో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
వరుణ్ తేజ్, లావణ్య తొలిసారి 'మిస్టర్' సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్టు సమాచారం
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మెగాస్టార్ ట్వీట్
About Last evening ..
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2023
Pre Wedding Celebrations of @IAmVarunTej & @Itslavanya #MomentsToCherish pic.twitter.com/TwUqaSUmXD