
Vayuputra : చందూ మొండేటి దర్శకత్వంలో 'వాయుపుత్ర'.. 2026 దసరాకు భారీగా రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఓ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి దర్శకుడు చందూ మొండేటి మెగాఫోన్ పట్టారు. చిత్రానికి 'వాయుపుత్ర' (Vayuputra) అనే టైటిల్‌ను ఖరారు చేసి, అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అందులో హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను తిలకిస్తున్నట్లుగా చూపించారు. ఈ చిత్రం విశేషంగా భారీ స్థాయి 3D యానిమేషన్‌లో తెరకెక్కుతోంది. హనుమంతుని కాలాతీత గాథను అద్భుతమైన దృశ్యకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం స్పష్టం చేసింది.
Details
త్వరలోనే మరిన్ని వివరాలు
తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా 2026 దసరా సందర్భంగా విడుదల కానుంది. చిత్ర బృందం ప్రకారం, ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. థియేటర్లను దేవాలయాల్లా మార్చే పవిత్ర అనుభూతిని అందించబోతోంది. భక్తి పారవశ్యంలో ప్రేక్షకులను ముంచెత్తి, మునుపెన్నడూ లేని అనుభూతిని కలిగించనుంది. 'వాయుపుత్ర' ఒక సినిమాటిక్ మైలురాయిగా నిలిచి, విశ్వాసం, శౌర్యం, విధి అనే విలువలను ఘనంగా జరుపుకునే వేడుకగా మారనుందని పేర్కొంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు యూనిట్ తెలిపింది.