ఓటీటీలో వీరసింహారెడ్డి ఊచకోత: నిమిషంలోనే లక్షా 50వేలకు పైగా వ్యూస్
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం నిన్న సాయంత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డులను ఊచకోత కోసేసింది. అదే మాదిరిగా ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. డిస్నీప్లస్ హాట్ స్టార్ లో నిన్న సాయంత్రం నుంచి అందుబాటులో ఉన్న వీర సింహారెడ్డి చిత్రం, రికార్డు స్థాయిలో వ్యూస్ పొందుతోంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో అందుబాటులో ఉన్న వీరసింహారెడ్డి, రిలీజైన నిమిషంలోనే లక్షా 50వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఓటీటీ హిస్టరీలో ఇదొక రికార్డు అని చెప్పుకుంటున్నారు.ముందు ముందు మరిన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ నిర్మించింది.