LOADING...
Karuppu : వర్కింగ్ డేలోనూ 'వీరభద్రుడు' వీరవిహారం.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు
వర్కింగ్ డేలోనూ 'వీరభద్రుడు' వీరవిహారం.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు

Karuppu : వర్కింగ్ డేలోనూ 'వీరభద్రుడు' వీరవిహారం.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2026
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మాస్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీ స్పందనను సొంతం చేసుకుని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.147 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా, వీకెండ్ తర్వాత వచ్చే తొలి సోమవారం పరీక్షలో కూడా అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. సాధారణంగా వర్కింగ్ డేలో సినిమాల కలెక్షన్లు తగ్గడం సహజం. అయితే 'కరుప్పు' మాత్రం ఆ ప్రభావాన్ని ఏమాత్రం అనుమతించకుండా సోమవారం కూడా బలమైన వసూళ్లను రాబట్టింది.

వివరాలు

ప్రేక్షకుల నుంచి విశేష స్పందన

ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రం డబుల్ డిజిట్ కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తమిళనాడుతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా 'కరుప్పు' బాక్సాఫీస్ జోరు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే రూ.15.50 కోట్ల గ్రాస్, రూ.7.94 కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసింది. అటు కర్ణాటకలో కూడా ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. తొలి వీకెండ్ ముగిసే సరికి అక్కడ రూ.9.91 కోట్ల గ్రాస్ సాధించిన 'కరుప్పు', సోమవారం ఒక్కరోజే రూ.1.67 కోట్లు రాబట్టి మొత్తం రూ.11.58 కోట్ల గ్రాస్‌ను అందుకుంది.

వివరాలు

సూర్య కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్

దీంతో అక్కడ కూడా ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. వర్కింగ్ డేస్‌లో కూడా ఈ స్థాయిలో బలమైన హోల్డ్ కొనసాగుతుండటంతో, 'కరుప్పు' చిత్రం తన పూర్తి రన్‌లో చాలా ఈజీగా రూ.250 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సూర్య నటన, మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషనల్ కంటెంట్— మొత్తం కలిసి ఈ చిత్రాన్ని భారీ విజయ దిశగా తీసుకెళ్తున్నాయి. మొత్తంగా చూస్తే, 'కరుప్పు' సూర్య కెరీర్‌లో మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభిమానుల దృష్టిలో ఇది ఆయనకు వచ్చిన పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీగా మారింది.

Advertisement