LOADING...
Aadarsha Kutumbam: త్రివిక్రమ్-వెంకటేశ్ కలయికలో కొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ - 'ఆదర్శ కుటుంబం'
త్రివిక్రమ్-వెంకటేశ్ కలయికలో కొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ - 'ఆదర్శ కుటుంబం'

Aadarsha Kutumbam: త్రివిక్రమ్-వెంకటేశ్ కలయికలో కొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ - 'ఆదర్శ కుటుంబం'

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు అధికారిక టైటిల్‌ను కూడా ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఆదర్శ కుటుంబం' అనే పేరు ఖరారు చేశారు. అలాగే, 'హౌస్ నం 47 (AK47)' అనే ఉపశీర్షిక కూడా అందించారు. ఈ ప్రాజెక్ట్‌ విషయాన్ని ప్రకటించిన వెంటనే సోషల్ మీడియా లో అనేక పేర్లు చర్చనీయాంశమయ్యాయి. వాటికి చెక్‌ పెడుతూ నేడు ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.

వివరాలు 

 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత వెంకటేశ్‌ సోలోగా నటిస్తున్న సినిమా ఇదే

అదేవిధంగా, సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభమైందని తెలిపి వెంకటేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఫస్ట్ లుక్‌లో వెంకటేశ్ సింపుల్, మధ్యతరగతి వ్యక్తి లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంచలన విజయం సాధించిన 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత వెంకటేశ్‌ సోలోగా నటిస్తున్న సినిమా ఇదే. ముందస్తుగా వెంకటేశ్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్','మల్లీశ్వరి' సినిమాలకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించినట్లు తెలిసిందే. అందువల్ల ఈ కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

వివరాలు 

 'దృశ్యం -3'తో మరోసారి థ్రిల్ పంచనున్నారు

త్రివిక్రమ్ గత చిత్రాల ప్రభావాన్ని కొనసాగిస్తూ, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ పాత్రలకు అవకాశం ఇవ్వనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ పాత్రల కోసం త్రిష, నిధి అగర్వాల్, రుక్మిణీ వసంత్ ల పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు వెంకటేశ్‌ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు, చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్'లో అతిథి పాత్రలో కనిపించనున్నారు. అలాగే, 'దృశ్యం-3' ద్వారా మరోసారి థ్రిల్ పంచనున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వెంకటేష్ చేసిన ట్వీట్ 

Advertisement