Page Loader
Sankranthiki Vasthunam: అదరగొడుతోన్న 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓవర్సీస్‌లో ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతంటే!
అదరగొడుతోన్న 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓవర్సీస్‌లో ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతంటే!

Sankranthiki Vasthunam: అదరగొడుతోన్న 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓవర్సీస్‌లో ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతంటే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

"సంక్రాంతికి వస్తున్నాం" అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అగ్ర కథానాయకుడు వెంకటేష్ పెద్ద పండగకు కావాల్సినంత వినోదాన్ని అందించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాకు భారీ విజయం సాధ్యమైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అక్కడ, ఈ చిత్రం వెంకటేశ్‌ కెరీర్‌లోనే ఆల్‌టైమ్‌ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో తొలిరోజు ఈ చిత్రం 7 లక్షల డాలర్ల ఆదాయం రాబట్టినట్లు టీమ్‌ వెల్లడించింది. వెంకటేశ్‌ కెరీర్‌లో ఇంత స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారి అని ప్రకటించటంతో, ఈ చిత్రం త్వరలోనే వన్ మిలియన్‌ క్లబ్‌లో చేరడం ఖాయమని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.

వివరాలు 

 వెంకటేశ్‌- అనిల్‌ రావిపూడి కాంబో మరోసారి సూపర్‌హిట్‌

ఈ సినిమాతో వెంకటేశ్‌- అనిల్‌ రావిపూడి కాంబో మరోసారి సూపర్‌హిట్‌గా మారిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలోని అందరి నటన కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ విజయంతో చిత్ర బృందం సంబరాలు జరిపింది. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ప్రేక్షకులకు, హీరో వెంకటేశ్‌ సహా యూనిట్‌ సభ్యులు తమ ధన్యవాదాలు తెలియజేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్