
సైంధవ్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్: సంక్రాంతికి రంగంలో దిగుతున్న వెంకటేష్ కొత్త సినిమా
ఈ వార్తాకథనం ఏంటి
వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా వస్తున్న చిత్రం సైంధవ్. హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను.. సైంధవ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. 2024సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన సైంధవ్ సినిమా విడుదలవుతుందని చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది.
నిజానికి ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ సమయంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ విడుదల ఉండడంతో కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందుతున్న సైంధవ్ సినిమాను వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్
This time, SANKRANTHI is going to be VICTORIOUS💥#SAINDHAV Grand Release In Theatres Worldwide on 13th January 2024🔥#SaindhavOnJAN13th
— Andrea Jeremiah (@andrea_jeremiah) October 5, 2023
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma pic.twitter.com/VEmcoWdczG