
Chiranjeevi - Venkatesh: చిరు సినిమాలో అతిథిగా వెంకటేశ్.. ఆ పాత్ర ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల అమెరికాలో జరిగిన నాట్స్ 2025 వేడుకల్లో పాల్గొన్న స్టార్ హీరో వెంకటేష్ తన రాబోయే సినిమాల లైనప్‌ను వెల్లడించి అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ ప్రకటనలతో ఆయన సినీ ప్రాజెక్టుల జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి, వెంకటేశ్ చిరంజీవి సినిమాలో కనిపించనున్నాడనే వార్తలు కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటిని ఇప్పటిదాకా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ ఇప్పుడు స్వయంగా వెంకటేష్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అంతేకాదు, ఆ పాత్ర ఎలా ఉంటుందన్న వివరాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను.
Details
దృశ్యం 3లో మీనాతో కలిసి నటిస్తున్నా
అలాగే చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాను. అది ఎంతో ఫన్నీగా, ప్రేక్షకులకు నవ్వులు పంచేలా ఉంటుంది. అలాగే మీనాతో కలిసి 'దృశ్యం 3' చేస్తున్నా. ఇటీవల అనిల్ రావిపూడితో కలిసి చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' మంచి విజయాన్ని అందుకుంది. మేమిద్దరం మళ్లీ కలిసి ఓ సినిమా చేస్తున్నాం. ఇవి కాకుండా, మరో భారీ ప్రాజెక్ట్‌లో నా స్నేహితుడితో కలిసి నటిస్తున్నాను. ఆయన తెలుగు పరిశ్రమలో ఒక పెద్ద స్టార్ అని వెంకటేశ్ తెలిపారు. ఈ సందర్భంగా తనపై ప్రేమ చూపించే అభిమానులకు నాట్స్ వేదికగా ధన్యవాదాలు కూడా తెలిపారు వెంకటేశ్.
Details
చిరు సరసన నయనతార
గత సంక్రాంతికి రిలీజ్ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా మంచి విజయం సాధించింది. ఇక వచ్చే సంక్రాంతికి చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ Mega 157 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిరంజీవి సరసన నయనతార నటించగా వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.