LOADING...
Venkatesh: వెంకీ మామ బర్త్‌డే స్పెషల్.. 'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి స్టైలిష్ లుక్ రివీల్
వెంకీ మామ బర్త్‌డే స్పెషల్.. 'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి స్టైలిష్ లుక్ రివీల్

Venkatesh: వెంకీ మామ బర్త్‌డే స్పెషల్.. 'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి స్టైలిష్ లుక్ రివీల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 13, 2025
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

అందరు హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ దాదాపు అన్ని హీరోల అభిమానులు విక్టరీ వెంకటేష్‌ను అభిమానిస్తారని ఎవరో అన్న మాట అక్షరాలా నిజమే. ఏ మాత్రం నెగెటివిటీ లేని వ్యక్తిత్వం, ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండే స్వభావంతో వెంకటేష్ అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి యూత్‌ వరకు ఆయన సినిమాలను ఆదరిస్తారు. అభిమానులు ఆయనను ప్రేమగా 'వెంకీ మామ' అని పిలుచుకుంటారు. ఈ రోజు (డిసెంబర్ 13) విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నుంచి వెంకీ లుక్‌ను విడుదల చేస్తూ మేకర్స్ అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఇచ్చారు.

Details

వెంకటేష్ బర్త్‌డే సర్‌ప్రైజ్

వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించాడు. 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నుంచి వెంకీ స్టైలిష్ లుక్‌ను ఓ వీడియోతో పాటు పోస్టర్ రూపంలో రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో వెంకటేష్ లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. వెనుకవైపు బ్లాక్ డ్రెస్‌లో గన్స్ పట్టుకుని బాడీగార్డ్స్ కనిపిస్తుండగా, ముందు వెంకీ స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్నట్లు చూపించారు.

Details

అనిల్ రావిపూడి స్టైల్

డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రమోషన్లు ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన ఏం చేసినా వెంటనే వైరల్ అవుతుంది. అదే స్టైల్‌లో ఈసారి కూడా వెంకటేష్ లుక్‌ను రివీల్ చేశారు. చుట్టూ ఆర్టిస్టులు ఉండగా, మధ్యలో కొరియోగ్రాఫర్ సందీప్‌తో కలిసి అనిల్ నిలబడి ఉంటాడు. "ఎనీ టైమ్, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్, విక్టరీ వెంకటేష్... హ్యాపీ బర్త్‌డే విక్టరీ వెంకటేష్ గారు అంటూ వెనకకు చూపించగానే వెంకీ లుక్ రివీల్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

Advertisement

Details

చిరు - వెంకీ కాంబినేషన్

అనిల్ రావిపూడి, వెంకటేష్ మధ్య బాండ్ ఇప్పుడు మరింత స్పెషల్‌గా మారింది. ఎఫ్2 తో మొదలైన వీళ్ల ప్రయాణం ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో విజయవంతంగా కొనసాగింది. ఇప్పుడు చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో వెంకటేష్‌తో ఓ కీలక పాత్రను చేయించారు అనిల్. చిరంజీవి - వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లు, ఫైట్, సాంగ్ అదిరిపోతాయని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాను 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వెంకి వీడియో వైరల్

Advertisement