LOADING...
Bhagyaraj: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత

Bhagyaraj: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత

వ్రాసిన వారు Moogati Shabari
Jun 27, 2026
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.

వివరాలు

సినిమా రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు..

నటుడిగా, దర్శకుడిగా, కథా రచయితగా తనదైన ప్రతిభను చాటుకున్న భాగ్యరాజ్ తమిళ సినిమా రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. కుటుంబ కథా చిత్రాలకు తన ప్రత్యేక శైలిని జోడించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. నటుడిగా 75కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, 25కు మించిన సినిమాలకు దర్శకత్వం వహించారు.

వివరాలు

సినీ ప్రముఖులు నివాళి..

దర్శకత్వం, కథా రచన, నటన, సంగీతం, నవలా రచన వంటి అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసిన భాగ్యరాజ్‌ను తమిళ సినీ పరిశ్రమలో 'వన్ మ్యాన్ స్టూడియో'గా కొనియాడేవారు. ఆయన మరణంతో తమిళ చిత్రసీమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, సినీ రంగానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement