వెట్రిమారన్ థ్రిల్లర్ మూవీ విడుతలై తెలుగులో కుడా రిలీజ్?
ఈ వార్తాకథనం ఏంటి
విసారణై, వడివాసల్, అసురన్ వంటి చిత్రాల దర్శకుడు వెట్రిమారన్, తాజాగా విడుతలై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కమెడియన్ సూరీ, ప్రధాన పాత్రలో నటించారు.
విలన్ గా గౌతమ్ వాసు దేవ మీనన్ నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఆల్రెడీ రిలీజైన ఈ చిత్ర టీజర్ కు తమిళంలో మంచి ఆదరణ దక్కింది.
మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంది. అంతకుముందు వరకూ కామెడీ పాత్రల్లో కనిపించిన సూరిని సీరియస్ పోలీసాఫీసర్ గా చూసి తమిళ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
విడుతలై చిత్రం, మార్చ్ 31వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్రముఖ సంస్థ ప్రయత్నిస్తుందని ప్రచారం జరుగుతోంది.
వెట్రిమారన్
తెలుగు రిలీజ్ పై అధికారిక సమాచారం కోసం వెయిటింగ్
వెట్రిమారన్ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా తెలుగు వాళ్ళు కూడా చూస్తారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన అసురన్ మూవీ, నారప్ప గా తెలుగులో రీమేక్ అయ్యింది. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరోగా చేసారు.
అప్పటి నుండి వెట్రిమారన్ సినిమాల మీద తెలుగు వాళ్లకు ఆసక్తి ఎక్కువగా ఉంది. అందుకే ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న విడుతలై సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.
ఈ విషయమై అధికారిక సమాచారం రాలేదు కానీ ఖచ్చితంగా తెలుగులో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్, గ్రాస్ రూట్ ఫిలిమ్ కంపనీ సంయుక్తంగ నిర్మిస్తున్నాయి.