విడుదల ట్రైలర్: వెట్రిమారన్ స్టైల్ ని తెలుగు వారికి పరిచయం చేయబోతున్నారు
తమిళ దర్శకుదు వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాయి. విసారణై, అసురన్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి ప్రభావాన్ని చూపాయి కూడా. ప్రస్తుతం మరో వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వెట్రిమారన్. విడుదలై పేరుతో తమిళంలో తెరకెక్కిన చిత్రాన్ని విడుదల పేరుతో అనువదించారు. ఏప్రిల్ 15వ తేదీన తెలుగు అనువాదం విడుదల సినిమాను అల్లు అరవింది రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు విడుదల ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ప్రజాదళం నాయకుడైన విజయ్ సేతుపతి పాత్రను పట్టుకునే క్రమంలో ఫీల్డ్ వర్కర్లను ఎన్ కౌంటర్ చేస్తారు పోలీసులు. ఆ తర్వాత కథానాయకుడు సూరి పాత్రను కానిస్టేబుల్ గా పరిచయం చేసారు.
భవాని శీ, సూరి పాత్రల మధ్య ప్రేమ
కానిస్టేబుల్ సూరిని ఇతర పోలీస్ ఆఫీసర్లు అందరూ చిన్నచూపు చూస్తారు. కానీ సూరికి మాత్రం ప్రజాదళం నాయకుడు విజయ్ సేతుపతి పాత్రను పట్టుకోవాలని ఉంటుంది. దానికోసం సూరి చాలా కష్టపడినట్లుగా చూపించారు. అదే సమయంలో హీరోయిన్ భవాని శ్రీ పాత్రను చూపించారు. భవాని శ్రీ , సూరి పాత్రల మధ్య ప్రేమ ఉంటుందన్నట్టుగా ట్రైలర్ లో కనిపించింది. పూర్తి ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. సాధారణ కానిస్టేబుల్ జీవితంలో జరిగే అంశాలను ఇందులో చూపించబోతున్నారని అర్థమైంది. ఆర్ఎఫ్ ఇన్ఫోటైన్మెంట్, గ్రాస్ రూట్ ఫిలిమ్ కంపెనీ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ప్రధాన పోలీస్ ఆఫీసర్ గా దర్శకుడు గౌతమ్ మీనన్ కనిపించారు.