
Saindhav: సైంథవ్ మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్
ఈ వార్తాకథనం ఏంటి
శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్(Venkatest) సైంథవ్(Saindhav) మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ వెంకటేష్ 75వ సినిమా.
దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
ఈ మూవీ రిలీజే డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో శైలేష్ టీం ప్రమోషన్స్ ను షూరు చేసింది.
ఇందులో భాగంగా విక్టరీ వెంకటేష్ సైంథవ్ మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు.
సైంథవ్ మూవీ కొత్త కథ, కథనంతో తెరకెక్కుతోందని, ప్రేక్షకులు మెచ్చితే 'సైంథవ్' కూడా చేస్తామని వెల్లడించారు.
Details
మరిన్ని మల్టీస్టార్ చిత్రాల్లో నటిస్తానన్న విక్టరీ వెంకటేష్
ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ, గుంటూరు పట్టణాల్లో సెంకడ్ సింగిల్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, అదే విధంగా బాబాయ్ హోటల్‌లో టిఫెన్ చేశానని వెంకటేష్ పేర్కొన్నాడు.
హీరోయిన్ శ్రద్ధ ఈ సినిమాలో బాగా నటించిందని, దర్శకుడు శైలేష్ స్టోరీ చెప్పగానే ఈ చిత్రం చేయడానికి ఒప్పుకున్నానని చెప్పాడు.
ప్రేక్షకులు ఈ మూవీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, త్వరలో మరిన్ని మల్టీస్టార్ చిత్రాల్లో నటిస్తానని వెల్లడించారు.